దండకరాణ్యంలో ‘‘ఆపరేషన్ అంతిమ్ ప్రహార్’’…

ఆగని సెర్చింగ్ ఆపరేషన్…

దిశ దశ, దండకారణ్యం:

చత్తీస్ గడ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయినప్పటికీ పోలీసుల సెర్చింగ్ ఆపరేషన్ యథావిధిగా కొనసాగుతూనే ఉంది. పార్టీ ముఖ్య నాయకులంతా జనజీనవంలోకి వచ్చినప్పటికీ అడవులను జల్లెడ పట్టే ప్రక్రియ మాత్రం నిర్వహిస్తూనే ఉన్నారు పోలీసులు. అయితే నిన్న మొన్నటి వరకు మావోయిస్టుల ఏరివేత కోసం కీకారణ్యాల్లో సంచరించిన బలగాలు ఇప్పుడు డంప్ ల ను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యాయి. మావోయిస్టు పార్టీకి సంబంధించిన డంపులను సమూలంగా తొలగించాలన్న లక్ష్యంతో బలగాలు ముందుకు సాగుతున్నాయి. మావోయిస్టులకు దండకారణ్యంలో మావోయిస్టులు తిరుగులేని ఆధిపత్యం సాధించుకున్న సమయంలో బలగాలపై దాడులు చేసేందుకు ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని భారీ ఎత్తున సేకరించి వాటిని అటవీ ప్రాంతంలోనే నిలువ ఉంచేవారు. మందుగుండు సామాగ్రితో పాటు ఆయుధాలు, ఆయుధ తయారీకి అవసరమైన మిషనరీ భారీ ఎత్తున దండకారణ్యంలో దాచి పెట్టారని పోలీసులు గుర్తించారు. దీంతో వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంతో చత్తీస్ గడ్, మహారాష్ట్రలకు చెందిన పోలీసు అధికారులు ఇంకా జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇందు కోసం ‘‘ఆపరేషణ్ అంతిమ్ ప్రహార్’’ కార్యక్రమాన్ని చేపట్టారు. గత పది రోజుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన రెండు భారీ డంపులను గుర్తించడంలో సఫలం అయిన పోలీసులు అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకత్వం కనుసన్నల్లో ఏర్పాటు చేసిన ఈ డంపులను గుర్తించేందుకు జనజీవనంలోకి వచ్చిన వారి నుండి కూడా ఆరా తీస్తున్నారు. ఈ డంపులలో ఇన్సాన్ వంటి ఆధునిక ఆయుధాలే కాకుండా వెపన్స్ తయారు చేసేందుకు అవసరమైన లేత్ మిషన్ ఇతరాత్రా సామాగ్రి లభ్యం అవుతోంది. అంతేకాకుండా పేలుడు కోసం ఉపయోగించే కార్డెక్స్ వైర్, జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్స్, లైవ్ కాట్రిడ్జ్‌ల్స్, మందుగుండు భారీ ఎత్తున దొరుకుతోంది. ప్రధానంగా బ్యారెల్ గ్రెనైడ్ లాంఛర్స్ ( Barrel Grenade Launchers) (BGL) సెల్స్, సెల్స్ తయారీకి ఉపయోగించే మెటిరీయల్, BGL లాంఛర్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్, ట్యూబ్ లాంఛర్ ఇనుప కడ్డీలు పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.

గడ్చిరోలి ఆపరేషన్…

పది రోజుల వ్యవధిలో రెండు ప్రధానమైన డంపులను స్వాధీనం చేసుకోవడంలో సఫలం అయ్యారు పోలీసులు. ఇందులో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పోలీసుల కీలక భూమిక పోషిస్తున్నారు. గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో మే 23న ఓ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. 27వ తేదిన గడ్చిరోలి జిల్లా, చత్తీస్ గడ్ నారాయణపూర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. నారాయణపూర్ జిల్లా కాకూర్ పోలీస్ స్టేషన్ కు 7 కిలో మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో మరో డంపును స్వాధీనం చేసుకున్నారు.

సెర్చింగ్…

దండకారణ్యంలో పోలీసులు ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇస్తున్న సమాచారమే కాకుండా పోలీసులు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టినట్టుగా సమాచారం. డంపులకు సంబంధించిన కోడింగ్ విధానం ఆధారంగా అడవుల్లో వాటిని గుర్తించేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. అటవీ ప్రాంతంలో మందు గుండు సామాగ్రిని నిర్వీర్యం చేసినట్టయితే భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా నిరోధించవచ్చని భావిస్తున్నారు పోలీసు అధికారులు. అలాగే అటవీ ప్రాంతంలో స్టోర్ చేసి ఉంచిన ఆయుధాలు సంఘ విద్రోహ శక్తుల చేతికి చిక్కకుండా ఉండాలంటే మావోయిస్టుల డంపులన్నింటిని కూడా రికవరీ చేయాలని పోలీసు అధికారులు సంకల్పించినట్టుగా సమాచారం.

DANDKARNYAMGadchiroli NaxalsMAOIST DUMPmaoist newsMAOIST PARTY
Comments (0)
Add Comment