ఐదు నిమిషాలు లేటు…

సంవత్సరం వేస్టు…

నిమిషం ఆలస్యం నిభందన ఆ విద్యార్థి పాలిట శాపంగా మారింది. సుదూర ప్రాంతం నుండి ఆత్రుతతో ఎగ్జామినేషన్ సెంటర్ కు చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆర్టీసీ బస్సు ఎక్కి గమ్యం చేరుకునే సరికి సమయం కాస్తా ముగిసిపోయింది. ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో సెంటర్ వద్ద నో ఎంట్రీ చెప్పేశారు. దీంతో స్టూడెంట్ కన్నీటి పర్యంతం అవుతు పరీక్షా కేంద్రం వద్ద పడిగాపుటు కాశాడు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సదరు విద్యార్థి ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం పరీక్షలు ప్రారంభం కావడంతో హుటాహుటిన సెంటర్ చేరుకోవాలని భావించినప్పటికీ బస్సులో గమ్యం చేరే సరికి సమయం ముగియడంతో లోపలకు వెళ్లలేకపోయాడు. దీంతో పరీక్షా కేంద్రం వద్ద సదరు విద్యార్థి కన్నీళ్లు పెట్టుకున్న తీరు స్థానికులను కలిచి వేసింది. ఈ ఏడాదంతా కష్టపడి చదివినప్పటికీ 5 నిమిషాల ఆలస్యం అతనికి ఏడాది వృథా చేసింది.

Intermediate ExamsLatest NewsNo entry for late comerstelangana news