మల్హర్ లో మర్డర్

దిశ దశ, భూపాలపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు భర్త. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన ముడెత్తుల రమేష్ తన భార్య లక్ష్మి గొంతు నులిమి చంపేశాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మహాదేవపూర్ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. అయితే అనుమానం కారణంగానే రమేష్ తన భార్యను హత్య చేశాడని స్థానికులు అంటున్నారు.

crimecrime newsCRIME TODAYtelangana crimetelangana crime news