కవితకు అనారోగ్యం… ఎయిమ్స్ లో చికిత్స

దిశ దశ, న్యూ ఢిల్లీ:

లిక్కర్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కొద్ది సేపటి క్రితం ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైరల్ ఫీవర్ తో పాటు గైనిక్ సమస్యలతో కవిత బాధపడుతున్నారు. తీహాడ్ జైలులో ఉన్న ఆమెను పరీక్షించిన జైలు వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దీంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.

BRS NEWSDelhi Liquor ScamKALVAKUNTLA KAVITHALatest NewsMLC KAVITHA