మావోయిస్టు పార్టీ పోస్టర్ల కలకలం…

దిశ దశ, భూపాలపల్లి:

ములుగు జిల్లా అటవీ ప్రాంతాల్లో మరోసారి మావోయిస్టు పార్టీ పోస్టర్లు ప్రత్యక్ష్యం అయ్యాయి. అధికార పార్టీ నాయకులే లక్ష్యంగా పలు ఆరోపణలు చేసిన ఈ పోస్టర్లు కలకలం సృష్టించాయి. ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో సీపీఐ మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ ప్రతినిధి భద్రూ పేరిట వెలువడిన ఈ పోస్టర్లలో పోలీసుల కూంబింగ్ వెంటనే నిలిపి వేయాలని లేనట్టయితే బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నుండి జిల్లా స్థాయి నాయకులను లక్ష్యం చేసుకుంటామని హెచ్చిరించారు. అటవీ అధికారులు కూడా పద్దతులు మార్చుకోవాలని, కానిస్టేబుల్ నాగయ్యకు పట్టిన గతే పడుతుందని కూడా అందులో పేర్కొన్నారు. ఈ విషయంలో వెలుగులోకి రాగానే ఏటూరునాగరం పోలీసులు రంగంలోకి దిగారు. ఈ పోస్టర్ల వెనక ఉన్నవారెవరూ..? ఏ సమయంలో వీటిని వేసి ఉంటారు అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.

Latest Newsmaoist newsMAOIST PARTYmulugu newstelangana news