పోలీసుల అదుపులో హిడ్మా వారసుడు…

త్వరలో అధికారిక ప్రకటన…

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PLGA) బెటాలియన్ వన్ కమాండర్ బార్సే దేవా తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. చత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువర్తికి చెందిన దేవా మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ నాయకుల్లో ఒకరు. దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన ముఖ్య నాయకుల్లో కొంతమంది జనజీవనంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత కీలక నాయకత్వం ఎదురు కాల్పుల్లో మరణించడం పార్టీ తీరని నష్టాన్ని చవి చూస్తోంది. దేశంలో మావోయిస్టు పార్టీకి ప్రధానమైన షెల్టర్ జోన్ గా ఉన్న బస్తర్ అటవీ ప్రాంతం, అభూజామడ్ కీకారణ్యాలే కాగా… మావోయిస్టు రహిత ప్రాంతంగా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారయి. ఈ నేపథ్యంలో పార్టీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజ్, కేంద్ర కమిటీ సభ్యులు పలువురు ఎదురు కాల్పుల్లో మరణించారంటే మావోయిస్టు పార్టీ ఎంతటి నిర్భందాన్ని ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు. మావోయిస్టు పార్టీమిలటరీ ఆపరేషన్లలో పేరొందిన మడావి హిడ్మా గత సంవత్సరం ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు. హిడ్మా అనుచరుడిగా పార్టీలో క్రియాశీలక భూమిక పోషిస్తున్న దేవా చేతికి మిలటరీ కమిషన్ పగ్గాలు అప్పగించినట్టుగా ప్రచారం జరిగింది. అయితే దేవా ఉనికి మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. తాజాగా దేవాతో పాటు మరో 14మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసు అధికారుల వద్దకు చేరుకున్నారని తెలుస్తోంది.

నేషనల్ పార్క్…

చత్తీస్ గడ్ లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం నుండి దాదాపు 40మంది మావోయిస్టులు జనజీవనంలోకి వచ్చేందుకు ప్రయత్నించినట్టుగా ప్రచారం జరుగుతోంది. వీరిలో బార్సే దేవా సహా 15మంది మావోయిస్టులు తెలంగాణకు చేరుకున్నట్టు సమాచారం.

సరిహద్దుల్లో…

దండకాణ్యం నుండి తెలంగాణకు వచ్చిన దేవా బృందాన్ని ఇక్కడి పోలీసులు ప్రత్యేక వాసనాల్లో హైదరాబాద్ కు తరలించినట్లు సమాచారం. వీరంతా జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతానికి చేరుకున్న సమాచారం అందుకున్న పోలీసులు వారిని హైదరాబాద్ తరలించినట్టుగా తెలుస్తోంది.

NIA వాంటెడ్…

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)మోస్ట్ వాంటెడ్ జాబితాలో దేవా కూడా ఉన్నారు. బలగాలపై దాడులు చేయడం, ఇతరాత్ర ఘటనలకు పాల్పడడంలో దేవా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. దాడులకు సంబంధించి వ్యూహాలు రచించండంలో దేవా పాత్ర ఉన్నట్టు సమాచారం. కొంతకాలం మీడియా వ్యవహారాలు కూడా పర్యవేక్షించిన దేవా ఒరియా, హిందీ, తెలుగు, ఆదివాసీల భాషలపై పట్టు ఉన్నట్టుగా సమాచారం.

PLGA?

మావోయిస్టు పార్టీకి అత్యంత కీలకమైన మిలటరీ కమిషన్ లో ముఖ్య నేతల్లొ ఒకరైన దేవా బాహ్య ప్రపంచంలోకి రావడంతో PLGA కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే హిడ్మా మరణించడం… ఆయన స్థానాన్ని భర్తీ చేస్తాడనుకున్న దేవా కూడా బయటకు రావడంతో పార్టీ మిలటరీ కార్యకలాపాలు అనుకున్నంత స్థాయిలో కొనసాగించడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జనజీవనంలోకి వచ్చిన మావోయిస్టు శ్రేణుల వద్ద AJ 47, INSASతో పాటు పలు రకాల ఆయుధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

Chattisgarhdandkaranyammaoist hidmamaoist newsMAOIST PARTY