భర్త చేతిలో భార్య హతం

అర్థరాత్రి ఘటన

దిశ దశ, వెల్గటూరు:

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. తాళి కట్టిన ఆలినే కడతేర్చాడు భర్త. సంఘటనా వివారల్లోకి వెల్తే… మండలంలోని స్తంభంపల్లికి చెందిన బొల్లం జగదీష్ ఆగ్రహంతో భార్య రాజేశ్వరని కత్తిపీటతో నరికి చంపాడు. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అయితే ఈ ఘటన అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో జరిగినట్టుగా తెలుస్తోంది. వెల్గటూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

crime newsCRIME TODAYJAGITHYALtelangana crimetoday crime news