ఎట్టకేలకు ఖైదీని పట్టుకున్న జైల్ యంత్రాంగం

గంటల వ్యవధిలోనే ట్రేస్…

దిశ దశ, భూపాలపల్లి:

పరకాల సబ్ జైల్ నుండి పరార్ అయిన ఖైదీని గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఉదయం చెత్త పారబోసేందుకు వెల్లి పరార్ అయిన మహ్మద్ గౌస్ పాషాను జైలు అధికారులు పరకాల శివార్లలోనే పట్టుకున్నారు. సోమవారం ఉదయం పరార్ అయిన నిందితుడు పరకాల సమీపంలోని కామారెడ్డిపల్లిలోని లలిత కన్వెషన్ హాల్ ముందు ఉన్న పొలాల్లో తలదాచుకున్నాడన్న సమాచారం అందుకున్న జైల్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోని ఎనిమిది మంది సిబ్బంది గౌస్ పాషాను పట్టుకున్నారు. ఉదయం పరార్ అయిన విషయం తెలియగానే పరకాల పట్టణం అంతా జైల్ అధికారులు అతని ఆచూకి కోసం కలియతిరుగారు. ఈ క్రమంలో కామారెడ్డిపల్లి పొలాల్లో ఉన్న సమాచారం అందుకోగానే అతన్ని జైలుకు తరలించారు. అయితే నిందితునిపై జైలు చెర నుండి తప్పించుకున్న కేసు కూడా పెట్టే అవకాశాలు లేకపోలేదు.

crimecrime newsCRIME TODAYLatest Newsparkal sub jailtelangana news