జీఎస్టీ ఎగవేతపై నాడే వెలుగులోకి…

గ్రానైట్ పాలిషింగ్ దందా…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ సమీపంలో ఏర్పాటు చేసిన గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ల నుండి తరలిస్తున్న విషయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ‘‘దిశ దశ’’ నాడే వెలుగులోకి తీసుకవచ్చింది. గత సంవత్సరం డిసెంబర్ 17న ‘‘జీఎస్టీ ఎగవేతకు భారీ స్కెచ్… బినామీల పేరిట లైసెన్సులు’’ అనే శీర్షికన ఓ కథనాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. గ్రానైట్ క్వారీల నుండి సేకరిస్తున్నరాళ్లను పాలిషింగ్ చేసి హైదరాబాద్ నగరానికి ఎగుమతి చేస్తున్న క్రమంలో 18 శాతం జీఎస్టీ ఎగవేసేందుకు బినామీ సంస్థలను క్రియేట్ చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడ్తున్నారంటూ బట్టబయలు చేసింది. అయితే తాజాగా DGGI అధికారులు కరీంనగర్ కేంద్రంగా సాగుతున్న అక్రమ దందాపై కొరడా ఝులిపించారు. రెండు రోజుల పాటు సోదాలు చేస్తే డమ్మీ సంస్థ పేరిట నకిలీ ఇన్వాయిసులు, నకిలీ వే బిల్లులు తయారు చేసి అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నారని తేల్చారు అధికారులు. రూ. వందల కోట్లలో సాగుతున్న ఈ దందా వల్ల ప్రభుత్వానికి రూ. కోట్లల ఆదాయానికి గండి పడుతోంది. తాజాగా DGGI అధికారులు M/s Manoj Enterprises అనే సంస్థను రిజిస్ట్రేషన్ చేసి రూ. 16 కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేశారని గుర్తించారు. ‘‘దిశ దశ’’ గతంలోనే పబ్లిష్ చేసిన కథనానికి సంబంధించిన లింక్ ను దిగువన షేర్ చేయడం జరుగుతోంది.
https://www.dishadasha.com/even-if-less-than-half-of-the-gst-is-paid-the-bills-are-given-brokers-in-granite-industries/

GraniteGranite Industrygranite scamgranite scam in telanganaTG NEWS
Comments (0)
Add Comment