కమ్యూనిస్ట్ యోధుడికి తీవ్ర అస్వస్థత

అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకున్న మంత్రి పువ్వాడ

సీపీఐ పార్టీకి చెందిన జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వర్ రావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడకు మెరుగైన వైద్యం అందించేందుకు హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం సోడియం లెవల్స్ గణనీయంగా పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఆయన తనయుడు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుని తండ్రి వెంట హైదరాబాద్ వెల్లారు.

BRS PARTYcpikhammamKhammam newsminister puvvada ajay kumar