చైనా అధ్యక్షుడి అధికారులకు నో ఎంట్రీ: అడ్డుకున్న సెక్యూరిటీ

దిశ దశ, న్యూ ఢిల్లీ:

బ్రిక్స్ దేశాల సమావేశంలో చైనా అధ్క్షుుడు జింపింగ్ అధికారులను దక్షిణాఫ్రిక సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. సదస్సుకు హాజరైన జింపింగ్ ప్రధాన వేదిక వద్దకు వెల్తుండగా జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది. బుధవారం జరిగినట్టుగా నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి హాట్ టాపిక్ గా మారింది. చైనా అధ్యక్షుడు జింపింగ్ వేదికవద్దకు వెల్తుండగా ఆయన వెంట వస్తున్న ప్రోటోకాల్ అధికారులను సెక్యూరిటీ యంత్రాంగం నిలువరించింది. వారు లోపలకు వెల్లే ప్రయత్నం చేసినప్పటికీ సెక్యూరిటీ ఆఫీసర్లు బలవంతంగా అడ్డుకుని జింపింగ్ లోపలకు ఎంట్రీ ఇచ్చిన తరువాత డోర్లు క్లోజ్ చేశారు. అయితే తన వెంట ప్రోటోకాల్ అధికారులు వస్తున్నారని భావించి ఓ సారి వెనక్కి తిరిగి చూసిన జింపింగ్ డోర్లు క్లోజ్ చేసి ఉండడంతో పదేపదే అటువైపు పరికించి చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుండడంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

BRICS SummitChinese Officials from entering BRICS main venueLatest NewsSouth African Security OfficersXi Jinping