మద్యం మత్తులో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

రోజు రోజుకు మహిళలపై అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. రోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యా చార ఘటనలు అనేవి జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసకుంది. అభం, శుభం తెలియని పసికందు, నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తుంది.

సంఘటన వివరాల్లోకి వెళ్లితే.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెంకటయ్య(40) కొన్ని రోజుల నుంచి శంషాబాద్‌లోని ఫైఓవర్ నిర్మాణం పనిలో లేబర్ కంపెనీలో కార్మికునిగా పని చేస్తున్నాడు. ఇక లేబర్ పని చేసే కార్మికులందరూ తహసీల్దార్ కార్యాలయం ముందు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో వెంకటయ్య, మద్యం సేవించి, గుడిసె పక్కన ఉన్న ఓ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక కేకలు వేయడంతో , తల్లిదండ్రులు అలర్టై నిందితుని పట్టకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసున్న పోలీసులు నిందితున్నిఅరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈఘటన కలకలం సృష్టిస్తుంది. పసి కందుపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని వదలకూడదంటూ అక్కడి వారు డిమాండ్ చేస్తున్నారు.

crimecrime newscrime storyCRIME TODAYSHAMSHABAD