అయోధ్య టు శ్రీలంక…

దిశ దశ, హుజురాబాద్ కరస్పాండెంట్:

శ్రీరామ జన్మ భూమి నుండి శ్రీలంక వరకు ఓ యువకుడు పాదయాత్ర చేపట్టారు. అఖండ భారతావనిలో శ్రీరాముడు వనవాసం చేస్తూ సంచరించిన ప్రాంతాల మీదుగా ఈయన తన యాత్రను కొనసాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు చెందిన సబిందర్ సింగ్ అయోధ్య నుండి తన యాత్రను మొదలు పెట్టారు. ఇప్పటి వరకు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, జార్ఖండ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్న ఆయన ఇక్కడి నుండి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలోని ఇల్లందకుంటను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… శ్రీ రాముడు వనవాసం చేస్తూ ఏఏ ప్రాంతాల్లో అయితే పర్యటించారో ఆ ప్రాంతాల మీదుగా తన పాదయాత్ర కొనసాగుతోందన్నారు. ఈ విధంగా తన ప్రణాళికను తయారు చేసుకుని పాదయాత్ర కొనసాగిస్తున్నానని వెల్లడించారు. చివరకు శ్రీలకం చేరుకున్న తరువాత తన పాదయాత్ర ముగుస్తుందన్నారు. అయోధ్య నగరం నుండి శ్రీరాముడు వనవాసం చేస్తూ అఖండ భారతదేశం అంతటా పర్యటించిన ప్రాంతాలతో పాటు సీతమ్మను ఎత్తుకెళ్లడంతో ఆమె చెర విడిపించేందుకు రాముడు శ్రీలంకకు కూడా వెల్లారు. సబిందర్ సింగ్ కూడా శ్రీలంక వరకు తన పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయించారు.

A young man who undertook a tour from Ayodhya to Sri LankaLatest News