పిళ్లైకి 3 రోజుల కస్టడీ పొడగింపు

బుచ్చిబాబుకు ఈడీ నోటీసులు

లిక్కర్ స్కాం కేసులో పిళ్లైకి మరో మూడు రోజుల పాటు కస్టడీకీ ఈడీ స్పెషల్ కోర్టు అనుమతించింది. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న పిళ్లై నుండి మరిన్ని వివరాలు రాబట్టాలని నిర్ణయించిన ఈడీ కస్టడీ పొడగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16 వరకు పిళ్లై ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు.

మరోవైపు ఎమ్మెల్సీ కవిత మాజీ అడిటర్ బుచ్చిబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న విచారణకు రావాలని అందులో పేర్కొంది. బుచ్చిబాబును పిళ్లైలను ఏకకాలంలో ఈడీ విచారించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

Delhi Liquor ScamFormer auditor BuchibabuLatest NewsLiquor scamMLC KAVITHA