దిశ దశ, జగిత్యాల:
ఉద్యమ పార్టీకి ఉద్యమకారులు బైబై చెప్తున్నారు… స్వరాష్ట్ర కల సాకారం కోసం నినదించిన గొంతుకలను అధికారంలో ఉన్నప్పుడు విస్మరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన అసలు సిసలు ఉద్యమకారులను ఏ మాత్రం పట్టించుకోలేదంటూ మండిపడుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన సమావేశంలో గులాభి పార్టీ తొలితరం నాయకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్నప్పటికీ తమను వివక్షకు గురి చేశారని, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి మాత్రమే అందలం ఎక్కించారంటూ ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం జై తెలంగాణ అని కూడా నినదించిన వారికే ప్రాధాన్యత ఇచ్చారని, పార్టీ కోసం ఏమాత్రం పనిచేయని వారినే అక్కున చేర్చుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం తమను పట్టి్ంచుకోని వైఖరితో విసిగివేసారిపోయిన తామంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరాలి అన్న విషయంపై కూడా త్వరలో సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుంటామని జగిత్యాల ఉద్యమకారులు వెల్లడించారు. అయితే తాము ఇక ముందు కూడా తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడంలో మాత్రం వెనకాడేది లేదని స్పష్టం చేస్తున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
dishadasha
2174 posts
Prev Post
Next Post

