వరంగల్… ఖమ్మం హైవేపై ఘటన
దిశ దశ, వరంగల్:
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఖమ్మం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం వర్దన్నపేట సమీపంలోని ఇల్లంద సమీపంలో తొర్రూర్ వైపునకు వెల్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
కూలీ పనికి వెల్తూ…
ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా కూడా దినసరి కూలీలని వేకువ జామునే ఉపాధి కోసం ఆటోలో ప్రయాణం చేస్తుంటారు. రోజులాగానే బుధవారం కూడా ఆటోలో వెల్తుండగా లారీ వచ్చి ఢీ కొట్టడంతో మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాందంతో ఇల్లంద హైవే రక్తసిక్తం కాగా…బాధిత కుటుంబాల రోధనలతో నిండిపోయింది. ఇంటి నుండి వెల్లిన నిమిషాల వ్యవధిలోనే తమ కుటుంబ సభ్యులు మరణించారన్న సమాచారం తెలియడంతో హతాషులయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post
