దిశ దశ, మంథని:
మలిదశ ఉద్యమకారుడు స్వరాష్ట్ర కల సాకారం కాదేమోనని కలత చెందిన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గుండా నాగరాజుకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన పదో వర్థంతి సందర్భంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఆయన విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమ కారులు స్మరించుకున్నారు. ఉద్యమ సమయంలో నాగరాజు చురుగ్గా పాల్గొనేవాడని, స్వరాష్ట్రం వస్తుందో రాదోనన్న ఆందోళనతో బలవణ్మరనానికి పాల్పడ్డాడని ఉద్యమ కారులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి గుడిసె గట్టయ్య యాదవ్, నాయకులు నూనె రాజేషం, వేల్పుల గట్టయ్య, గోగుల రాజిరెడ్డి, జాడి జంపన్న, పోయిల బాపు, మిుడ కొండన్న, మంథని విజయ్ కుమార్, సాదుల శ్రీనివాస్, కాసిపేట మల్లేష్, నలుమాసు ప్రభాకర్, నాగరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Prev Post
