థర్డ్ జెండర్ అఘౌరీపై అత్యాచారం కేసు..!

ఎల్లారి శ్రీనివాస్ పై మరో కేసు…

దిశ దశ, కరీంనగర్:

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అఘౌరి ఎల్లారి శ్రీనివాస్ వ్యవహారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హిందూ ధర్మం పేరిట తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల వద్ద హల్ చల్ చేసిన అఘౌరీ శ్రీనివాస్ పాల్పడ్డ నేరాలు అన్నీ ఇన్నీ కావని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణాలో ఇప్పటికే పలు కేసులు నమోదయిన అఘౌరీ శ్రీనివాస్ పై కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో కేసు నమోదు అయింది. ఇటీవల హైదరాబాద్ శివార్లలోని మోఖిలా పోలీస్ స్టేషన్ లో నమోదయిన కేసులో అఘౌరీ శ్రీనివాస్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే శ్రీనివాస్ ను సంగారెడ్డి జైలుకు తరలించగా అతను ఆడా, మగా అన్న విషయంపై క్లారిటీ లేదని జైలులోకి తీసుకోలేమని అధికారులు వెల్లడించారు. దీంతో మోఖిలా పోలీసులు ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా అఘౌరీ శ్రీనివాస్ థర్డ్ జండర్ అని డాక్టర్లు ధృవీకరించడంతో చంచల్ గూడలోని స్పెషల్ జైలుకు తలరించారు. గత సంవత్సరం నవంబర్ 21న కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ బాధితురాలిని ట్రాప్ చేసి కిడ్నాప్ చేయడంతో, అత్యాచారానికి పాల్పడ్డాడని, జగిత్యాల జిల్లా కొండగట్టుకు తీసుకవెళ్లి అమె మెడలో పవిత్ర దారం కట్టాడన్న కేసు నమోదు అయింది. ఆ తరువాత బాధితురాలి నుండి రూ. 3 లక్షలు కూడా వసూలు చేసిన నిందితుడు ఈ విషయం బయటకు చెప్పినట్టయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. సదరు బాధితురాలికి ఫోన్ ద్వారా పరిచయం అయిన శ్రీనివాస్ మొదట సనాతన ధర్మం గురించి చెప్తూ ఆమెను ట్రాప్ చేసినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అఘౌరీ శ్రీనివాస్ పై కొత్తపల్లి పోలీసులకు గత ఏప్రిల్ 28న బాధితురాలు ఫిర్యాదు చేశారు. నిందితునిపై క్రైం నంబర్ 201/2025, సెక్షన్ 64(1), 87, 318(4), 351(2) BNS act లలో కేసు నమోదు చేశారు కొత్తపల్లి పోలీసులు. అయితే శ్రీనివాస్ మోఖిలా పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో అతనిపై కరీంనగర్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లోనూ మరో కేసు నమోదు అయిందన్న విషయం వెలుగులోకి వచ్చింది.

నగ్నంగా తిరుగుతూ…

ఎల్లారి శ్రీనివాస్ అఘౌరీగా మారిపోయినట్టుగా తానకు తాను చెప్పుకుని ఆలయాల చుట్టూ తిరగడం ఆరంభించాడు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశన్ పల్లికి చెందిన శ్రీనివాస్ గురించి మీడియాలో కథనాలు రాగానే మంచిర్యాల ప్రాంతంలో అతని గురించి కథకథలుగా చెప్పేవారు. అయితే ఆయన స్వస్థలానికి చెందిన వారు చెప్పిన అంశాలు ఆయన చేసిన హల్ చల్ ముందు అంతగా వెలుగులోకి రాకుండా పోయాయనే చెప్పాలి. కొండగట్టు అంజన్న ఆలయానికి నగ్నంగా వచ్చిన అఘౌరీ ప్రత్యేక పూజలు చేశాడు, ఇదే సమయంలో ఓ గ్రామంలో శ్మశాన వాటికకు వెల్లిన ఈఘౌరీ కాలుతున్న శవం చుట్టూ ప్రదక్షిణలు చేసిన వీడియోను వైరల్ చేశాడు. ఏపీలోని శ్రీ కాళహస్తి దేవాలయంలో దర్శనం కోసం నగ్నంగా వెల్తుంటే ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినా వినలేదు ఆలయ ఉద్యోగులు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయంలోకి కూడా నగ్నంగా వెల్లినప్పుడు అక్కడి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రచ్చ రచ్చ చేశాడు. ఇకపోతే వేములవాడ రాజన్న ఆలయం దర్శనానికి వచ్చినప్పుడు గర్భాలయం ముందు ఉన్న దర్గాను తొలగిస్తానని డేట్ ఫిక్స్ చేసి ప్రకటించాడు. పలుమార్లు వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చేందుకు ప్రయత్నించంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు సరిహద్దుల్లోనే అఘౌరీని అడ్డుకున్నారు. ఆలయాల చుట్టూ తిరుగుతూ సనాతన ధర్మాన్ని పదే పదే చెప్తుంటే చాలా మంది కూడా అఘౌరీ అని నమ్మేశారు. దీంతో అఘౌరీ శ్రీనివాస్ కు భక్త బందం కూడా తయారైనట్టుగా  ఉంది. కీకారణ్యాల్లో ఉండే అఘౌరీల వద్ద తాను శిష్యరికం చేశానని కూడా పలు ఇంటర్వ్యూల్లో చెప్పడంతో నిజమని నమ్మేశారు జనం. తానోక దైవాంశ సంభూతిడిని అని నమ్మించే పనిలో పడ్డ అఘౌరి శ్రీనివాస్ పైకి సనాతన ధర్మ వచనాలు వల్లె వేస్తూ వెనక చేసే తతంగాలు వేరేనని తేలిపోయింది. మోఖిలా పోలీసులు కేసు నమెదు చేయడంతో అఘౌరి శ్రీనివాస్ గుట్టు రట్టు కావడం మొదలైంది. ఒక్కొక్కరుగా బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండడంతో అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఛీటిగ్ కేసుల్లో ఉన్న శ్రీనివాస్ బాధితులు తెలుగు రాష్ట్రాలలో ఇంకా ఎంతమంది ఉన్నారోనన్న చర్చ కూడా సాగుతోంది. అఘౌరీ వేషంలో సనాతన ధర్మం ముసుగు వేసుకుని ఏ ఏ ప్రాంతాల్లో ఎంతమందిని మోసం చేసి ఉంటాడో అంతుచిక్కకుండా పోయింది. అయితే అఘౌరి శ్రీనివాస్ ను వివిధ ప్రాంతాల్లో వాహనాల్లో తిప్పిన శిష్య బృందం గురించి ఇప్పటి వరకు వెలుగులోకి రావడం లేదు. అఘౌరీ ఎక్కడకు వెల్లినా ఇద్దరి నుండి ముగ్గురి వరకు శిష్యులను, డ్రైవర్లను తన వెంట పెట్టుకుని తిరిగేవాడు. ఆయనపై క్రిమినల్ కేసుల పరంపర మొదలు కాగానే ఈ శిష్య బృందం జాడ లేకుండా పోయింది. వారిని కూడా పోలీసులు విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.