దిశ దశ, కరీంనగర్:
భూ దందాకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ కార్పోరేటర్ తోట రాములు, చీటి రామారావులను పోలీసు కస్టడికీ ఇచ్చేందుకు కరీంనగర్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఒక రోజు కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు కరీంనగర్ పోలీసులు. రాజిరెడ్డి అనే సింగరేణి రిటైర్డ్ కార్మికునికి సంబంధించిన భూమి విషయంలో హద్దులు మార్చి తమ భూమిగా చిత్రీకరించిన విషయంలో ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్లూ) ద్వారా సమగ్ర విచారణ జరిపించిన కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు కార్పోరేటర్ తోట రాములు, చీటి రామారావులను కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల గురించి ఆరా తీయాల్సి ఉందని, ఇందుకు వారిని విచారించేందుకు అనుమతించాలని కరీంనగర్ కోర్టులో పిటిషన్ వేయగా ఈ మేరకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఒక రోజు వీరిని విచారించిన తరువాత కోర్టులో హాజరు పర్చనున్నారు పోలీసులు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
dishadasha
2175 posts

