Phone tapping case: సంచలనాల ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం…

హైదరాబాద్ రానున్న రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రంలో నమోదయిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. వస్తాడా, రాడా, కేసు నీరు గారిపోయినట్టేనా అన్న చర్చ సాగుతున్న సమయంలో రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేందుకు సముఖత వ్యక్తం చేశారు. తాను స్వదేశానికి వస్తానని, హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణకు సహకరిస్తానని ప్రభాకర్ రావు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆయన రాక దాదాపుగా ఖాయం అయింది. ఇంతకాలం పెండింగులో ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 5న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణాధికారి ముందు హాజరవుతారని కూడా తెలుస్తోంది.

14 నెలలుగా

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసిన తరువాత పలువురు పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. అయితే స్పెషల్ ఇంటలీజెన్స్ బ్యూర్ (SIB) చీఫ్ గా వ్యవహరించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు అమెరికా వెల్లిపోయారు. ఈ కేసులో ఆయనను విచారించాల్సి ఉన్నప్పటికీ ఆయన స్వదేశంలో లేకపోవడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. మొదట్లో తాను క్యాన్సర్ చికిత్స కోసం వచ్చాను తప్ప ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నుండి తప్పించుకునేందుకు కాదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ప్రభాకర్ రావు అమెరికా కోర్టును ఆశ్రయించినట్టుగా ప్రచారం జరిగింది. మరోవైపున ప్రభాకర్ రావును అరెస్ట్ చేసేందుకు రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చే ప్రక్రియను కొనసాగించారు పోలీసులు. ప్రభాకర్ రావు పాసుపోర్టును రద్దు చేయాలని సిఫార్సు చేయగా ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. అమెరికాలోనే తనను విచారించాలని అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించినట్టుగా కూడా ప్రచారం జరిగినప్పటికీ సానుకూలత లభించనట్టుగా స్పష్టం అయింది. ఆయన ఇంటి వద్ద సోదాలు కూడా నిర్వహించిన పోలీసులు కోర్టులను ఆశ్రయిస్తూ… ప్రభాకర్ రావును హైదరాబాద్ కు రప్పించడమే లక్ష్యంగా పావులు కదిపారు. ఇటీవలె ప్రొక్వెయిమ్డ్ అఫెండర్ గా ప్రభాకర్ రావును గుర్తిస్తూ నోటీసులు జారీ అయ్యాయి. 14 నెలలుగా స్వదేశానికి రాకుండా అమెరికాలోనే ఉన్న ప్రభాకర్ రావు తాజాగా సుప్రీం కోర్టుకు తాను వస్తానని పాస్ పోర్టు ఇప్పించాలని కోరడం, ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభాకర్ రావు ఎట్టకేలకు ఈ నెల 5వ తేదిన సిట్ విచారణకు హాజరు కానున్నట్టుగా వెల్లడించారు. దీంతో ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

You cannot copy content of this page