దిశ దశ, జగిత్యాల:
రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రమాదం సంభవించింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. తిరుగు ప్రయాణంలో మెట్ పల్లి మండలం మారుతి నగర్ శివార్లలో మంత్రి కాన్వాయికి ఎదురుగా వస్తున్న టోయింగ్ వెహికిల్ మంత్రి ప్రయాణిస్తున్న వాహనానికి తగలడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంత్రి అడ్లూరి ప్రయాణిస్తున్న కారు ముందు టైర్ ఊడిపోయింది. దీంతో మంత్రి లక్ష్మణ్ కుమార్ కు క్షేమంగానే ఉన్నారని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ప్రమాదం జరిగిన తరువాత మరో వాహనంలో మంత్రి వెల్లిపోయారు. ఘటనా స్థలానికి కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు, స్థానిక డీఎస్పీ అడ్లూరి రాములు చేరుకున్నారు.

