తీర్థయాత్రల స్పెషలిస్ట్… 86 సార్లు వైష్ణో దేవి దర్శనం…

దిశ దశ, కరీంనగర్:

జమ్మూ కశ్మీర్ లోని వైష్ణోదేవి మందిరానికి వెళ్లాడాం అసాధ్యం అనుకుంటారు. అల్లంత దూరంలో ఉన్న అమ్మవారి దర్శనానికి వెళ్లడం అసాధ్యమేనన్న భావనతో ఉంటారు. కానీ ఆయనకు మాత్రం ఆ ఆలయానికి వెళ్లిరావడం అత్యంత కామాన్. కరీంనగర్ కోతిరాంపూర్ లో నివాసం ఉంటున్న కె వరప్రసాద్ ఇప్పటికీ 86 సార్లు వైష్ణోదేవి ఆలయానికి వెళ్లగా మార్చి 8న 87వ సారి వెళ్లనున్నారు. ఒక్కో ఏడాది మూడు నుండి ఐదు సార్లు వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించేందుకు ప్లాన్ చేసుకుంటారు. సంక్రాతి, వేసవి, విజయదశమి సెలవుల్లో ఖచ్చితంగా వైష్ణోదేవి ఆలయానికి వెల్లి వస్తుంటానని తెలిపారు. 108 సార్లు వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని వివరించారు. అష్టాదశ శక్తి పీఠాలు, 108 ఉప శక్తి పీఠాలలో శ్రీలంక, పాకిస్తాన్ లోని పీఠాలను సందర్శించినట్టయితే అన్నింటిని  చుట్టి వచ్చినట్టవుతుందన్నారు. వరప్రసాద్ ఇప్పటి వరకు కాశీకి 69 సార్లు, తిరుపతికి 273, అరుణాచలం 27, పూరి జగన్నాథ్ ఆలయానికి 30 సార్లు వెల్లొచ్చారు. జ్యోతిర్లింగాలలో ఛార్ ధామ్ యాత్ర మినహా మిగతా అన్ని ఆలయాలను దర్శించుకున్నారు.