దిశ దశ, అంతర్జాతీయం:
ఆకాశంలో చంద్రునితో పాటు కనిపించాల్సిన చుక్కలు పాకిస్తాన్ సమీపంలోకి వచ్చాయా అన్న రీతిలో సాగుతోంది యుద్దం. చీకటి పడిందంటే చాలు పాకిస్తాన్ వాసులు గగనతలం వైపు తలలు ఎత్తి చూస్తూనే ఉంటున్నారు. చీమ్మ చీకట్లు అలుముకోవడంతో డ్రోన్ల వెలుతురు చూసిన అక్కడి ప్రజలు భారత్ దేశానికి తీరని నష్టం చేకూరబోతోందని కలలు కంటున్నారు. మార్గ మధ్యలోనే కుప్పకూలిపోతున్న డ్రోన్ల గురించి తెలుసుకుని నీరుగారి పోతున్నారు. తెల్లవారి డ్రోన్ల శకలాలు వెతికి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ బారత దేశం దాడులను పాక్ సరైన గుణపాఠం చెప్పిందని దుష్ప్రచారం చేసుకుంటున్నారు. ఇది భారత సరిహధ్దుల్లోని పాకిస్తాన్ లో నెలకొన్న వాస్తవ పరిస్థితి.
శుక్రవారం రాత్రి…
వైమానిక దాడులు చేసి భారతదేశంలో విధ్వంసాలు సృష్టించాలని పాకిస్తాన్ అంచనాలను ఆకాశంలోనే మన ఆకాశ్ భస్మీపటలం చేసేస్తోంది. టర్కీ, అజర్ బైజాన్ ఇచ్చిన డ్రోన్లు సీమ టపాకాయలకన్నా అధ్వాన్నమైన ఫలితాలను అందిస్తున్నా ప్రత్యామ్నాయం లేని పాకిస్తాన్ ఆ దేశం పంపిన వాటితోనే దాడులకు తెగబడి చతకిల పడిపోతోంది. ఓ వైపున సొంత పార్టీ ఎంపీలు, పాకిస్తాన్ మెజార్టీ ప్రజలు వద్దని వారిస్తున్నా కయ్యానికి కాలు దువ్వుతామని అంటోంది పాక్ సర్కార్. ఆర్థికంగా, ఆయుధ పరంగా బలహీనంగా ఉన్నామని తెలిసి కూడా భారత సరిహద్దు ప్రాంతాలపై అటాక్ చేసేందుకే మొగ్గు చూపుతోంది. శుక్రవారం రాత్రి నుండి శనివారం తెల్లవారు జాము వరకు పాకిస్తాన్ తన కుటిల బుద్దిని పోనిచ్చుకోకుండా డ్రోన్లను క్షిపణులను ప్రయోగిస్తూనే ఉంది. త్రివిధ దళాలు కంటికి రెప్పలా భారతదేశాన్ని రక్షించే పనిలో నిమగ్నం అయ్యాయి. లక్ష్యాలను చేధించేందుకు దూసుక వస్తున్న డ్రోన్లు, మిస్సైల్స్ అన్ని కూడా పాక్ భూ భాగంలో నేలపై పడిపోతున్నాయి. కాశ్మీర్‌లోని అవంతిపోరా వైమానిక దళ స్థావరంపై డ్రోన్ దాడి చేయడానికి ప్రయత్నించగా భారత వైమానిక రక్షణ దళాలు గాలిలోనే ధ్వంసం చేసేశాయి. మొత్తం 26 ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేయగా వాటిని ధ్వంసం చేయడంలో భారత రక్షణ వ్యవస్థ సఫలం అయింది. టర్కీ, అజర్ బైజాన్ ఇచ్చిన డ్రోన్ల సాయంతో గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలోని ముఖ్య నగరాలే లక్ష్యంగా దాడులకు పూనుకుంది. అయితే అవి లక్ష్యాన్ని చేధించేలోపునే రక్షణ విభాగం సాంకేతికతతో వాటిని ధ్వంసం చేయడంతో సరిహద్దు రాష్ట్రాల ప్రజలు క్షేమంగా ఉన్నారు. రెండు యుద్ద విమానాలను కూడా భారత్ కూల్చివేయడంతో పాకిస్తాన్ ఆర్మీ ప్రయత్నాలన్ని గాల్లోనే కలిసిపోతున్నాయి. మరో వైపున పాకిస్తాన్ బాలిస్టిక్, ఫతే క్షిపణులను కూడా ప్రయోగించగా లక్ష్యం చేరేలోపునే భారత రక్షణ దళాలు కూల్చివేయడంతో భారీ నష్టాన్ని నివారించగలిగింది మన రక్షణ వ్యవస్థ. జమ్మూ కశ్మీర్ సరిహధ్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ ట్యూబ్ లాంచ్డ్ డ్రోన్లను ప్రయోగించే పోస్టులు, ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ లను భారత సైన్యం ధ్వంసం చేసేసింది.
పాకిస్తాన్ లో పేళుల్లు…
ఇకపోతే అంతర్జాతీయ వార్త సంస్థల కథనాల ప్రకారం పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో విధ్వంసాలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 36 మంది పాకిస్తానీలు చనిపోయినట్టుగా అక్కడి అధికార వర్గాలు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్ & షేక్‌పురా, నర్వాల్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లలో భారీ పేలుళ్ల సంభవించాయి.
ప్రకృతి ప్రకోపం…
మరో వైపున పాకిస్తాన్ పరిస్థతి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. అటు బలుచిస్తాన్ ఇటు భారత్ లతో ప్రత్యక్ష్య పోరాటం చేస్తోంది. అక్కడ నెలకొన్న పరిణామాలతపై సొంత దేశంలోనే వ్యతిరేకతనున మూటగట్టుకున్న పాక్ ప్రభుత్వం. తాజాగా ఆ దేశంపై ప్రకృతి కూడా కన్నెర్న చేసినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.0గా నమోదయినట్టుగా తెలుస్తోంది.
మారని మనిషి…
ఇకపోతే ఇంతకాలం భారత్ అంతమొందిస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాక్ రక్షణ మంత్రి తనలోని కుటిల నీతిని బయటపెట్టారు. పాక్ పార్లమెంట్ లో భారత్ తో జరుగుతున్న పరిణామాలపై అక్కడి ఎంపీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎంపీ అయితే భారత ప్రధాని మోడీని చూస్తే పాకిస్తాన్ ప్రభుత్వం గజగజ వణికిపోతోందని ఎద్దేవా చేశారు. ఇండియాతో పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని అక్కడి అధికార పార్టీ నాయకులే తప్పు పడుతున్న పరిస్థితి ఎదురయింది. అయితే రక్షణ మంత్రి పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సరికొత్త చర్చకు దారి తీశాయి. ఇప్పటికే 36 మందిని కోల్పోయామని అధికారికంగా ప్రకటించిన పాకిస్తాన్ సైన్యం బలం సరిపోనట్టయితే మదర్సాలలో చదువుకుంటున్న యువకులను యుద్ద రంగంలోకి దింపుతామని ప్రకటించారు. విద్యా బుద్దులు నేర్పించేందుకు నిర్వహిస్తున్న మదర్సాల్లోని యువతను వాడుకుంటామని అని ప్రకటించారంటే వారికి అక్కడ ఏరకమైన శిక్షణ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. శత్రు దేశాలతో యుద్దం అనవార్యం అయినప్పుడు స్వచ్ఛందంగా ముందుకు ఆయా దేశాల పౌరులను సైన్యానికి సహకరించేందుకు వినియోగించుకుంటుంటారు. కానీ పాకిస్తాన్ మాత్రం అక్కడి పౌరుల సేవలను వినియోగించుకునేందుకు మొగ్గు చూపకుండా మదర్సాలలోని యువతను యుద్దానికి పంపిస్తామని ప్రకటించడం విస్మయానికి గురి చేస్తోంది.