ఈ నెలలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,500 ఆశా వర్కర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు బస్తీ దవాఖానల్లో కోటి మంది ప్రజలు సేవలు పొందారని వెల్లడించారు. పేదల సౌకర్యం కోసం బస్తీ దవాఖానల పని దినాల్లో మార్పు చేస్తామని తెలిపారు. ఇకపై శనివారం సెలవు ఇస్తున్నామని, ఆదివారం పనిచేయనున్నాయని వివరించారు. బస్తీల సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించి, అద్భుతమైన సేవలు అందిస్తున్నారని హరీశ్ రావు కొనియాడారు. రూ. 800 విలువ చేసే లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ 1.48 లక్షల మందికి, థైరాయిడ్ పరీక్షలు లక్షా 800 మందికి ఉచితంగా చేశామని చెప్పారు. ప్రస్తుతం బస్తీ దవాఖానాల్లో 57 రకాల పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. వీటిని త్వరలో 134 రకాల పరీక్షలకు పెంచుతామని.. 158 రకాల మందులు ఉచితంగా ఇస్తున్నామని స్పష్టం చేశారు. బస్తి దవాఖానాలు స్థానికంగా సేవలందిస్తుండడం వల్ల పెద్ద ఆస్పత్రుల్లో ఓపి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయని చెప్పారు. ఉస్మానియాలో 5 లక్షల మంది (60%), గాంధీలో 3.7 లక్షల మంది (56%), నిలోఫర్ 5.3 లక్షలు (44%), ఫీవర్ ఆసుపత్రిలో లక్ష 12 వేలు (72%) వంటి పెద్దాసుపత్రుల్లో ఓపీ తగ్గగా, శస్త్ర చికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. సీరియస్ పేషెంట్లకు తక్షణ వైద్యం అందించడంపై పెద్దాసుపత్రుల్లో సాధ్యం అవుతోందన్నారు. వచ్చే ఏప్రిల్ నెలలో అన్ని జిల్లాలో న్యూట్రిషన్ కిట్‌ను అందిస్తామని హరీశ్ రావు తెలిపారు. త్వరలోనే మేడ్చల్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని హరీశ్ రావు తెలిపారు. క్రమంగా అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post
