అసెంబ్లీ స్పీకర్ కు కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన డాక్టర్ సంజయ్

దిశ దశ, హైదరాబాద్:

కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశం పంచాయితీ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ వద్దకు కూడా చేరింది. ఆదివారం కరీంనగర్ లో జరిగిన రివ్యూ మీటింగ్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తనను తోసేసి, బూతు పదజాలం ఉపయోగించాడని స్పీకర్ కు ఇచ్చిన ఫిర్యాదులో జగిత్యాల ఎమ్మెల్యే  డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరారు.