దిశ దశ, మంథని:
పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమిటీ ఛైర్మన్, డైరక్టర్లను నియమిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఛైర్మన్ గా కుడుదుల వెంకన్న, వైస్ ఛైర్మన్ గా ముసుకుల ప్రశాంత్ రెడ్డి, డైరక్టర్లుగా మంథని సదానందం, కన్నబోయిన ఓదెలు, ఎండీ అంకూస్, రేగళ్ల రాంమోహన్ రావు, ఊదరి శంకర్, గాదం పోచయ్య, అజ్మీరా చందూ నాయక్, పన్నాల ఓదెలు, దూలం సులోచన, లింగంపల్లి నర్సింగరావు, రావికంటి వెంకటేష్, ఎల్లంకి శంకర లింగం, మల్హర్ పీఏసీసీఎస్ ఛైర్మన్, పెద్దపల్లి జిల్లా మార్కెటింగ్ అధికారి, మంథని ఏడీఏ, మంథని మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
జనరల్ కోటాలో…
నామినేటెడ్ పదవులను అప్పగించే విషయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. మంథని మార్కెట్ కమిటీ ఛైర్మన్ జనరల్ కెటగిరిలో రిజర్వూ కాగా బీసీ నాయకునికి ఛైర్మన్ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. రాష్ట్రంలో బీసీ నినాదం బలంగా వినిపిస్తుండడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తన నియోజకవర్గంలో కూడా శ్రీధర్ బాబు కూడా బీసీలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన కోట రాజబాబుకు అప్పగించారు. తాజాగా మంథని ఏంఎంసీ ఛైర్మన్ బాధ్యతలు కూడా బీసీకి ఇప్పిచండం విశేషం.

