కరీంనగర్ మేయర్ అభ్యర్థిగా కొమురయ్య..?

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రయత్నాలు చేసి చివరకు సఫలం అయిన కూటమి కొద్ది సేపటి క్రితం సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విమర్శలు తిప్పి కొట్టే విధంగా కార్పొరేషన్ లో కీలకంగా ఉన్న రెండు పార్టీల ముఖ్య నాయకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వారు కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వివేకానంద విద్యా సంస్థల వ్యవస్థపకుడు కొమురయ్య పేరును ఫైనల్ చేసినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. విద్యావంతుడైన కొమురయ్య పేరును ప్రతిపాదించినందుకే తాము కూడా మద్దతు ఇచ్చామని బీఆర్ఎస్ నాయకులు ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆదివారం మద్యాహ్నం వరకూ మెజార్టీ కోసం పావులు కదిపి చివరకు సక్సెస్ కావడంతో కొమురయ్య పేరును మేయర్ గా ప్రతిపాదించాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం.

అదే డివిజన్… 
2026
బీజేపీ నాయకులు పదో డివిజన్ నుండి బరిలో నిలిపిన డి శంకర్ ను మేయర్ చేయాలని భావించింది. అయితే ఆ పార్టీ టికెట్ ఆశించిన కొమురయ్యకు చివరి నిమిషంలో ఆశాభంగం కావడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. దీంతో పదో డివిజన్ నుండి గెలిచిన కొమురయ్యే కూటమి పార్టీల మద్దతుతో మేయర్ గా బాధ్యతలు చేపట్టనున్నట్టుగా స్పష్టం అయింది. బీజేపీ అనుకున్నట్టుగా పదో డివిజన్ అభ్యర్థిని గెలవకపోయినప్పటికీ అదే డివిజన్ నుండి గెలిచిన కొమురయ్యకు మేయర్ గా మద్దతు లభించడం విశేషం.