Telangana: డాక్టర్స్ డే రోజున డాక్టర్ల ధర్నా..!

చల్మెడ జూనియర్ వైద్యుల నిరసన

దిశ దశ, కరీంనగర్:

అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం రోజున జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. వారికి న్యాయం చేయాలంటూ చల్మెడ మెడికల్ కాలేజ్ ముందు ధర్నా చేశారు. కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ లోని మెడికల్ కాలేజ్ మెయిన్ గేట్ ముందు ఆందోళన జరిగింది. ఇంటెన్‌షిప్ చేస్తున్న తమ సేవలను వినియోగించుకుంటున్నారు కానీ స్టైఫండ్ ఇవ్వడంలో మాత్రం వివక్షారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రతి నెల స్టైపండ్ చెల్లిస్తున్నా… వారికి మాత్రం ఇవ్వడం లేదు. అయినప్పటికీ తమతో ఇష్టారీతిన సేవలు చేయించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయంగా రావల్సిన స్టైఫండ్ వారికి ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం తమపై వివక్ష చూపుతోందని హౌజ్ సర్జన్లు ఆరోపిస్తున్నారు. నామమాత్రంగా స్టైఫండ్ ఇస్తామంటున్నారని ఇది ఎంతవరకు సమంజసమో చెప్పాలని అడిగారు. అయితే నామినల్ స్టైఫండ్ కూడా చెల్లించడం లేదని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. చల్మెడ మెడికల్ కాలేజీ యాజమాన్యం తమకు రావల్సిన స్టైఫండ్ మొత్తం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దాదాపు మూడు గంటల పాటు ఈ ఆందోళన కొనసాగింది. ఈ సందర్భంగా “వి వాంట్ స్టైఫండ్” అంటూ నినాదాలు చేశారు.