దిశ దశ, న్మూఢిల్లీ:
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పది రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేందుకు మరో 14 రోజలు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కవితకు బెయిలు ఇవ్వాలని ఆమె తరుపు లాయర్లు కోరారు. అయితే కోర్టు మాత్రం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు కవితను రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశించడంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. కవిత మధ్యంతర బెయిలుపై వేసిన పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారించనుంది కోర్టు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
dishadasha
2173 posts

