నమ్మించి గొంతు కోసేశారు… దాడులకు తెగపడ్డ పాకిస్తాన్…

ట్రంప్ దౌత్యం ఫెయిల్…

మాటలొకటి చేతలొకటి…

దిశ దశ, జాతీయం:

అంతా అనుకున్నట్టుగానే దాయాది దేశం నమ్మకాన్ని వమ్ము చేసింది. అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించినట్టే నమ్మించి తన వక్ర బుద్దిని ప్రదర్శించింది. కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్టే ఒప్పుకుని చీకటి కాగానే తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టింది. జమ్మూ కశ్మీర్ లక్ష్యంగా అస్త్రాలను సంధించడం మొదలు పెట్టింది. కాల్పుల విరమణకు ఇండో పాక్ దేశాలు ముందుకు రావడంతో సరిహధ్దు గ్రామాల ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే ఒక్కసారిగా బాంబుల వర్షాన్ని కురిపించడం మొదలు పెట్టింది. ఒక్కటా రెండా వందల సంఖ్యలో బాంబులతో దాడులకు పూనుకుంది. ఉగ్రవాదులతో మాకు సంబంధం లేదని యావత్ సమాజాన్ని నమ్మించి మోసం చేసినట్టే కాల్పుల విరమణ విషయంలోనూ అదే పంథాను ప్రదర్శించింది. అగ్ర రాజ్య అధినేత ట్రంప్ ద్వారా భారతదేశాన్ని మెప్పించి ఒప్పించిన గంటల వ్యవధిలోనే జమ్ము కాశ్మీర్ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసింది. కాల్పుల విరమణపై వ్యూహాత్మకంగా వ్యవహరించి అందరినీ మోసం చేసేసింది.

బ్లాక్ ఔట్…

పాకిస్తాన్ వక్రబుద్దిని అంచనా వేయలేకపోయిన భారత్ నిజాయితీగా త్రివిధ దళాలను వెనక్కి పిలిపించే పనిలో నిమగ్నం కాగానే తన కుటిల బుద్దిని ప్రదర్శించింది. దీంతో శత్రు దేశం లక్ష్యాలను ఛేదించుకుండా ఉండేందుకు జమ్మూతో సహా సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్ ఔట్ ప్రకటించింది.

గుడాఛారి అనుమానం… 

పాకిస్తాన్ వ్యవహార శైలి విషయంలో అపనమ్మకంతో ఉన్న భారత దేశ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ గంట క్రితం తన అనుమానాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. దాయాది దేశం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందా అన్న అనుమానం వ్యక్తం చేసినట్టుగానే పాకిస్తాన్ రణరంగాన్ని సృష్టిస్తోంది. అంతా ప్రశాంతంగా మారిందని అనుకున్న సరిహధ్దు రాష్ట్రాల ప్రజలు కూడా భయం గుప్పిట ఒదిగిపోవల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

ఆర్మీ చీఫ్ తిరుగుబాటు..? 

కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అక్కడి ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. కాల్పుల విరమణ వద్దే వద్దని తేల్చి చెప్పడంతోనే మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసిందని తెలుస్తోంది. భారత ఆర్మీ ఇరు దేశాల ప్రభుత్వాల ఒప్పందానికి అనుగుణంగా నడుచుకుంటే పాకిస్తాన్ ఆర్మీ మాత్రం దేశాధినేతలపైనే తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి తయారైంది. అయితే ఇండో, పాక్ మధ్య నెలకొన్న పరిణామాలపై చర్చలు జరుపుతున్న దాయాది దేశం ముఖ్య నేతలు ఖచ్చితంగా ఆర్మీ చీఫ్ తో కాల్పుల విరమణ అంశం గురించి చర్చించి ఉంటారు. ఆయన వినడం లేదన్న విషయాన్ని ముందుగానే చెప్తే భారత్ తన పని తాను చేసుకుంటూ వెల్లేది. కానీ పాక్ ప్రభుత్వం అమెరికాను, ఇండియాన్ ఛీటింగ్ చేసినట్టుగా స్పష్టం అవుతోంది. అక్కడి ఆర్మీ సక్సెస్ కావాలన్న తపనతో కాల్పుల విరమణ ఒప్పుకున్నట్టుగా పాక్ ప్రభుత్వం నటించిందా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది.

ఇండియా నారాజ్…

భారత ప్రభుత్వం కూడా కాల్పుల ఒప్పందం చేసుకున్న తీరుపై చాలా వరకూ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 1971 నాటి పరిస్థితులను కూడా తీసుకరాకుండా కేంద్ర ప్రభుత్వం ఎలా ఒప్పుకుందన్న చర్చ జరుగుతోంది. గతంలో ఒప్పందాల ఉల్లంఘన విషయాలను పాకిస్తాన్ పట్టించుకోలేదన్న విషయాలను భారత పెద్దలు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేకపోయారన్న ఆవేదన సగటు పౌరుడిలో వ్యక్తం అవుతోంది. ఒక దశలో ఆనాడు ఇందిరా గాంధీ చేసిన ధైర్యం కూడా నేటి ప్రభుత్వం చేయలేకపోయిందన్న వాదనలు కూడా వినిపించాయి. ప్రపంచ వ్యాప్తంగా పట్టు బిగించిన ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్యంగా వెనక్కి తగ్గడమేంటన్న తర్జనభర్జనలు సాగాయి. ఓ వైపున ఈ చర్చలు సాగుతున్న క్రమంలోనే పాకిస్తాన్ కుట్రలకు తెరలేపడం యావత్ భారత దేశాన్ని కలవరపెడుతోంది.

You cannot copy content of this page