దిశ దశ, అంతర్జాతీయం:
ఇండ్ పాక్ దేశాలు కాల్పుల విరమణ విషయంలో నిర్ణయానికి వచ్చాయి. శనివారం సాయంత్రం 5 గంటల నుండి ఇరు దేశాలు కాల్పులు జరపవద్దని నిర్ణయించుకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు. మద్యాహ్నం 3.35 గంటలకు పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరక్టర్ జనరల్ (DGMO), భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరక్టర్ జనరల్ కు కాల్ చేసి కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారన్నారు. ఇందుకు సమ్మతించి సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణకు ఒప్పుకున్నామని విక్రమ్ మిస్రీ ప్రకటించారు. ఈ మేరకు రెండు దేశాలు కూడి త్రివిధ దళాలకు కూడా ఆధేశాలు ఇచ్చాయని తెలిపారు. ఈ నెల 12 మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ కూడా కాల్పుల విరమణకు అంగీకరించామని వెల్లడించారు. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్ చేశారు. ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని, మధ్యవర్తిత్వం వహించామని ప్రకటించారు. అంతేకాకుండా ఇండియా, పాకిస్తాన్ దేశాలకు అభినందనలు కూడా తెలిపారు. అమెరికా అధ్యక్షుడు.