దిశ దశ, మహదేవపూర్:
కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్దరణ పనులు చకచకా సాగుతున్నాయి. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సూచనల ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మత్తుల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) సిఫార్సుల మేరకు బ్యారేజీకి పరీక్షలు నిర్వహించారు నిపుణులు. Central Water &Power Research Station, Pune (CWPRS) ద్వారా జరుగుతున్న పనులు జరుగుతున్నాయి. బ్యారేజీ పిల్లర్ కుంగుబాటుకు గురి కావడంతో నీటిని నిలువ ఉంచకూడదని NDSA కాళేశ్వరం ఇంజనీర్లకు సూచించింది. సామర్థ్యానికి అనుగుణంగా బ్యారేజీని పునరుద్దరించేందుకు అవసరమైన సూచనలు చేయడంతో ఇందుకు అనుగుణంగా మరమ్మత్తులు చేపట్టారు. పనుల పురోగతి సాగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించాలని NDSA సూచించడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు.


