దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతం మావోయిస్టులు, పోలీసుల మధ్య దాడులు ప్రతి దాడులతో దద్దరిల్లిపోతున్నట్టుగా ఉంది. నిత్యం ఏదో ఒక చోట ఎదురు కాల్పుల ఘటనలు… నక్సల్స్ చర్యలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం మరో బారీ ఎన్ కౌంటర్ జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టుల హతమైనట్టుగా తెలుస్తోంది. బీజాపూర్ జిల్లాలోని గంగూలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొర్చోలి, లేంద్రా అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగినట్టుగా సమాచారం. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టు పార్టీ నక్సల్స్ హతం కాగా ఒక ఇన్సాస్ లైట్ మిషన్ గన్, ఒకే 47 తుపాకి లభ్యం అయినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మరికొంతమంది నక్సల్స్ కు గాయాలైనట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
dishadasha
2175 posts
Next Post

