దండకారణ్యంలో ఎదురు కాల్పులు…

నలుగురు మావోయిస్టులు ఒక జవాన్ మృతి

దిశ దశ, దండకారణ్యం:

నారాయణపూర్, దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు ఒక డీఆర్జీ హెడ్ జవాన్ మరణించారు. అడపా దడపా ఎదురు కాల్పులు జరుగుతున్నాయని పోలీసులు అధికారులు తెలిపారు. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని అభూజామఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలును నిరోధించేందుకు DRG, STF బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ నెల 3వ తేదిన అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహస్తున్న క్రమంలో మావోయిస్టులు తారసపడడంతో ఎదురు కాల్పులు జరిగాయని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, AK 47, SLR ఆయుధాలు కూడా లభ్యమయ్యాని పోలీసు అధికారులు వివరించారు. ఎదురు కాల్పుల్లో DRG హెడ్ జవాన్ సన్ను కరమ్ చనిపోయాడని అతని మృతదేహాన్ని దంతెవాడ జిల్లా కేంద్రంలోని పోలీస్ లైన్ కు తరలించిన పోలీసు అధికారులు ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రావల్సి ఉంది.