దిశ దశ, హైదరాబాద్:
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు దాడులు చేపట్టారు. హైదరాబాద్ లోని ఆమె నివాసానికి శుక్రవారం చేరుకున్న ఈడీ అధికారులు దాడులకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీతో పాటు హైదరాబాద్ కు చెందిన ఈడీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి కవిత ఇంట్లో సోదాలు జరుపుతున్నట్టుగా సమాచారం. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇప్పటికే ఈడీ ఎధుట హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె హాజరు కాలేదు. అనూహ్యంగా శుక్రవారం ఈడీ అధికారులు దాడులు చేయడం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది. మొదట ఐటీ దాడులని ప్రచారం జరిగినప్పటికీ కవిత ఇంటికి చేరుకున్నది ఈడీ అధికారులని తెలిసింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
dishadasha
2419 posts
Prev Post
Next Post

