దిశ దశ, హైదరాబాద్:
క్యాన్సర్ బాధితులు ఆ కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స అందుకోవాలంటే సామన్యమైన విషయం కాదు… అక్కడ చేరిన పేషెంట్ తాలుకూ బంధువులు ప్రత్యక్ష్య నరకం చూడాల్సిందే. ఆపరేషన తప్పని సరి అయిన బాధితుల బంధువుల పరిస్థితి అయితే మరీ దారుణమనే చెప్పాలి. లక్షల్లో వేసే బిల్లులు చెల్లిస్తున్నా ఒక రకమైన భయంతో బిక్కుబిక్కుమంటూ ఆ దవాఖానాలో కాలం వెల్లదీయాల్సిందే. ఆ డాక్టర్ నుండి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు… ఎప్పుడు ఏం కావాలని అడుగుతారో తెలియదు… దీంతో ఆసుపత్రి కారిడార్ లోనే అటెండెన్స్ పడిగాపులు పడాల్సిందే. ల్యాబ్ విభాగం నుండి వచ్చిన వారు మీ పేషెంట్ కు సర్జరీ ఉంది ఇన్ని యూనిట్ల రక్తం కావాలి తీసుకరండి అని చెప్తారు. అప్పటికప్పుడు బ్లడ్ తీసుకరాకుంటే ఆపరేషన్ చేయడం కష్టమన్న సంకేతాలు ఇచ్చేసి పేషెంట్ తాలుకూ బంధువులను ఆందోళనకు గురి చేస్తారు. మహా నగరంలో రక్త దాతల కోసం అన్వేషించి రక్తం తీసుకొచ్చి బ్లడ్ బ్యాంకులో అప్పగించే సరికి వారి తల ప్రాణం తోకకు వస్తుంది.
సీన్ కట్ చేస్తే…
మీ పేషెంట్ కు సర్జరీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం… మీరు సిద్దంగా ఉండాలని ఆసుపత్రి సిబ్బంది ద్వారా మెసెజ్ పంపిస్తారు. క్యాన్సర్ బారిన పడ్డ వారిని థియేటర్ కు తరలిస్తున్నామని చెప్పి కొన్ని గంటల ముందే తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్తారు. పేషెంట్ ను థియేటర్ కు అలా తీసుకెళ్తారో లేదో వెంటనే ఆసుపత్రి సిబ్బంది అటెండెన్స్ ఉన్న గదికి వచ్చి రూం ఖాళీ చేయాలని హుకూం జారీ చేస్తారు. తమ పేషెంట్ కు ఆపరేషన్ అయిన తరువాత అదే గదిలోకి తీసుకొస్తారని తాము ఇక్కడే వెయిట్ చేస్తామని అటెండెన్స్ చెప్పినా పట్టించుకునే వారు ఉండరు. లేదు లేదు రూం ఖాలీ చేసేశాం పెట్టెబేడా సర్దుకుని వెళ్లాల్సిందేనని హెచ్చరిస్తారు. అప్పటికప్పుడు గదిలోని వస్తువులు, దుస్తులు సర్దుకుని బయటకు రాగానే ఆసుపత్రి సిబ్బంది చెప్పిన చోట వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. సర్జరీ సక్సెస్ అయితే అటెండెన్స్ కు ఆసుపత్రిలోకి ఎంట్రీ ఫెయిల్ అయితే అక్కడి నుండి బయటకు పంపించేయడం అక్కడ రివాజుగా మారింది. ఈ సమయంలో ఆ ఆసుపత్రి సిబ్బంది చేసే హంగామా అంతా ఇంతా కాదు. పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందన్న విషయాన్ని కూడా చెప్పకుండా వారిని అయోమయానికి గురి చేసేందుకు ఎదురు దాడికి దిగుతారు. ఇంతలో బిల్లింగ్ సెక్షన్ నుండి డబ్బులు చెల్లించాలంటూ కాల్ వస్తుంది. అక్కడకు వెల్లి డబ్బులు కట్టిన తరువాత వెనక ద్వారాం నుండి పేషెంట్ మృతదేహం స్టెచర్ పై తీసుకొచ్చి అంబూలెన్స్ మాట్లాడుకుని తీసుకవెళ్లాలని చెప్పి చేతులు దులిపేసుకుంటారు. లక్షల రూపాయలు ఖర్చు చేసినా లాభం లేకుండా పోయిందన్న భాద నుండి వారు తేరుకోకముందే… ఏమైంది శవాన్ని తీసుకెళ్లాలని చెప్తే మీకు వినిపించడం లేదా అంటూ ఆసుపత్రి సిబ్బంది కసురుకోవడం మొదలు పెడ్తారు. గంట లోగానే వారిని అక్కడి నుండి పంపించేందుకు ఆ ఆసుపత్రి సిబ్బంది చేసే ఒత్తిళ్లు అన్నీ ఇన్ని కావు. ఇదేం పద్దతి అని ప్రశ్నించే వారికి పోలీసులకు అప్పగిస్తామని బెదిరింపులకూ గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది క్యాన్సర్ చికిత్స అందించే ప్రముఖ కార్పోరేట్ ఆసుపత్రిలో నెలకొన్న వాస్తవ పరిస్థితి.
రిపిట్ అయిందా..?
ఇప్పుడు అదే ఆసుపత్రిని నిర్వహిస్తున్న, ఇండియాలోనే ఫేమస్ అయిన సదరు డాక్టర్ గారికి ఖర్మ రిపిట్ అయిందేమోనని అనిపిస్తోంది. ఇదే విషయంలో రాష్ట్రంలోని డాక్టర్స్ గ్రూపుల్లోనే ఆయనకు ఎదుర్కొంటున్న దుస్థితి గురించి కథకథలు షేర్ అవుతున్నాయి. ఖర్మ ఈజ్ రిపిట్ అన్న రీతిలో జరుగుతున్న ఈ కామెంట్లకు కారణమేంటంటే… సదరు ప్రముఖ డాక్టర్ గారి తనయ కూడా అంకాలజీలో ఎండీ పూర్తి చేశారు. తాజాగా ఆమె డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హైండెడ్ గా పట్టుబడ్డారు. డ్రగ్స్ తో పాటు లావాదేవీలకు సంబంధించిన వివరాలు, సరఫరా చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంబీఏ చేసేందుకు స్పెయిన్ వెల్లిన ఆమె కొకైన్ డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెట్టి ఇప్పుడు దానికి బానిసలా మారిపోయిరు. 2023లో స్వదేశానికి తిరిగి వచ్చినా డ్రగ్స్ వదులకోలేకపోయిన ఆమె ఫిల్మ్ నగర్ లోని ఓ కేఫ్ లో డీజేగా పనిచేస్తున్న తన స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ ద్వారా కొకైన్ కొనుగోలు చేస్తున్నారు. డ్రగ్స్ వినియోగానికి మరింత అడిక్ట్ అయిపోయిన సదరు డాక్టర్ ముంబాయికి చెందిన వంశ్ టక్కర్ ద్వారా కొకైన్ కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుండి వాట్సప్ ద్వారా వంశ్ టక్కర్ ద్వారా నేరుగా కొకైన్ కొనుగోలు చేస్తున్న ఆమె లక్షలాది రూపాయల విలువ చేసే స్టాక్ తెప్పించుకుని నిలువ ఉంచుకునే వారు. ఈ క్రమంలోనే షేక్ పేటలోని ఓ హోటల్ సమీపంలో కారులో డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. ఆమె మొబైల్ ఫోన్ లో వంశ్ టక్కర్ తో ఛాట్ చేసిన వివరాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న బాలకృష్ణ రామ్ ప్యార్ రామ్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తనకు రూ. 10 వేల కమిషన్ ఇస్తారని వంశ్ టక్కర్ ద్వారా వచ్చే డ్రగ్స్ ను ఆమెకు అందిస్తున్నానని బాల కృష్ణ రామ్ ప్యార్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఆమెను ఆరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బిజీ డాక్టర్ గజిబిజి…
సొంత కూతురు అందునా వైద్య వృత్తిలో స్థిరపడిన తరువాత డ్రగ్స్ కు అలవాటు పడిన తీరు తెలిసిన సదరు కార్పోరేట్ ఆసుపత్రి డాక్టర్ పరిస్థితి ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది. ఎప్పుడూ బిజీగా ఉండే ఆ డాక్టర్ గారి కూతురు డ్రగ్స్ తో అడ్డంగా దొరికిపోవడంతో గజిబిజిగా అయిపోయి ఉంటారన్న కామెంట్లు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా సామాన్యుల నుండే కాకుండా వైద్య వృత్తిలో స్థిరపడిన వారు కూడా ఆ ప్రముఖ డాక్టర్, ఆయన కూతురు ఎదుర్కొంటున్న పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు అందుకోవల్సిన దుస్థితి దాపురించింది. అయితే డ్రగ్స్ కు బానిసైన సదరు డాక్టర్ జీవితాన్ని చూసైనా డబ్బు యావలో పడి కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు అన్న విషయాలపై దృష్టి పెట్టుకోకపోతే ఎలాంటి పరిణామాలు చవి చూడాల్సి వస్తుందోనన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. మీడియాల్లో తరుచూ ఇంటర్కూలు ఇస్తూ పొగాకు ఉత్పత్తుల వినియోగానికి దూరం కండి లేనట్టయితే క్యాన్సర్ బారిన పడతారని అందరిని తట్టిలేపే ఆ కార్పేరేట్ డాక్టర్ ఇప్పుడు డ్రగ్స్ వాడడం వల్లే అనర్థాల గురించి కూడా తెలుసుకోవల్సిన ఆవశ్యకత ఏర్పడింది.