ఎదురు కాల్పులు… మందుపాతరలు..

లంకపల్లి అడవుల్లో అసలేం జరిగింది..?

దిశ దశ, దండకారణ్యం:

చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లోని లంకెపల్లి అడవుల్లో  ఎదురు కాల్పులతో పాటు మందుపాతర పేలినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మావోయిస్టు పార్టీ మెయిన్ క్యాడర్ ఉందన్న సమచారంతో బలగాలు కూంబింగ్ చేపట్టినట్టుగా సమాచారం. గురువారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఎదురు కాల్పులు జరుగుతున్న క్రమంలోనే మందుపాతర పేలినట్టుగా తెలుస్తోంది. 

కీలక నేత..?

అయితే లంకలపల్లి అడువుల్లో తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలు కూంబింగ్ చేపట్టిన ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అగ్ర నేతతో పాటు మరికొంతమంది నక్సల్స్ షెల్టర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మవోయిస్టు పార్టీ డెన్ వద్దకు చేరుకున్న బలగాలకు , నక్సల్స్ కు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టుగా సమాచారం. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ ముఖ్య నేతతో పాటు మరో నలుగురు చనిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది.  ఎదురు కాల్పులు జరుగుతున్న క్రమంలోనే బలగాలు మోహరించ కాల్పలు జరుపుతుండగానే మందుపాతర పేలడంతో పలువురు పోలీసులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు చనిపోయారని ఐదుగురు చనిపోయారన్న పుకార్లు వస్తున్నాయి. వీరిలో ఓ ఆర్ఎస్ఐ కూడా ఉన్నాడని మిగతా వారంతా కానిస్టేబుళ్లని కూడా అంటున్నారు. లంకపల్లి ప్రాంతంలో కొన్ని గ్రే హౌండ్స్ యూనిట్లు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అధికారికంగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించాల్సి ఉంది. చత్తీస్ గడ్ రాష్ట్ర పరిధిలో జరిగిన ఈ ఘటనపై అక్కడి పోలీసు అధికారులు ప్రకటన విడుదల చేస్తే తప్ప పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. అయితే మందుపాతరలు కూడా ఈ షెల్టర్ జోన్ చుట్టూ మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్నారంటే పార్టీ ముఖ్యనేత ఉండి ఉంటాడని భావిస్తున్నారు.

చంద్రన్న..?

మరో వైపున లంకపల్లి ప్రాంతంలోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గురువారం ఉధయం జరిగిన ఎదురు కాల్పుల ఘటన చంద్రన్న షెల్టర్ జోన్ వద్ద జరిగిందా లేక ఇతర నక్సల్స్ ఏర్పాటు చేసుకున్న డెన్ పై జరిగిందా అన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో చంద్రన్నకు ఏమైనా అయిందా అన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో అసలేం జరిగింది అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

You cannot copy content of this page