ఆహారం లేక… అడవుల్లో ఉండలేక… మావోయిస్టుల కష్టాలు…

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. దశాబ్దాలుగా అభూజామఢ్ అటవీ ప్రాంతాల్లో తిరుగులేని ఆదిపత్యం ప్రదర్శించిన పార్టీ ఇప్పుడు ముఖ్య నాయకులను కూడా కోల్పోతున్న తీరు ఆందోళన కల్గిస్తోంది. సామాన్య కార్యకర్త నుండి కేంద్ర కమిటీ కార్యదర్శి వరకు ఎప్పుడు ఎవరు ఏ ఎన్ కౌంటర్ లో చనిపోతారోనన్న భయం వెంటాడుతోంది. వామపక్ష భావజాల ఉద్యమాలతో దశాబ్దాలుగా అనుబంధం పెనవేసుకున్న మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకులు ఎదురీదుతున్న తీరు సంచలనంగా మారింది.

కగార్ తో కంగారు…

మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఆపరేషన్లు చేపట్టాయి. ఆపరేషన్ సమాధాన్ నుండి కగార్ వరకు నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయాలన్న లక్ష్యంతో బలగాలు ముందుకు సాగుతున్నాయి. కాకులు దూరని కారడువుల్లో నివాసం ఉంటున్న ఆదివాసీలతో మమేకమై వారి గుంపుల్లో కలిసిపోయి ఉంటున్న మావోయిస్టు పార్టీతో ఆఖరి యుద్దం కొనసాగిస్తామని ప్రభుత్వం తేల్చిచెప్తున్నాయి. ఈ నేఫథ్యంలోనే కర్రెగుట్టల నుండి మొదలు అభూజామఢ్ ఫారెస్ట్ అంతా జల్లెడ పడుతున్నాయి బలగాలు.

పకడ్భందీ వ్యూహం…

మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకులే లక్ష్యంగా కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్న బలగాలు పకడ్భందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. కర్రెగుట్టలపై ఏకంగా 21 రోజుల పాటు ఆపరేషన్ కొనసాగించిన బలగాలు భారీగా మావోయిస్టు నక్సల్స్ ను ఏరివేశాయి. అంతేకాకుండా పేలుడు పదార్థాలు, ఆయుధాలను, నిత్యవసర సరుకులను కూడా స్వాధీనం చేసుకున్నాయి. అయితే కర్రెగుట్టల ఆపరేషన్ తరువాత కూడా మావోయిస్టు ముఖ్య నాయకత్వం కోసం గాలింపు చర్యలు మాత్రం యధావిధిగా కొనసాగిస్తూనే ఉన్నాయి బలగాలు.

చక్రబంధంలో…

చత్తీస్ గడ్ లోని బస్తర్ ఉమ్మడి జిల్లా, గరియాబంద్, ఒడిషాలోని మల్కాన్ గిరి జిల్లాల్లోని అడవుల చుట్టు బలగాలు చక్కబంధం వేసినట్టుగా ఉంది. ఇక్కడి సమీప ప్రాంతాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరింపజేసి మావోయిస్టులు బాహ్యప్రపంచంలోకి రాగానే వేటాడాలన్న లక్ష్యంతో ఆపరేషన్లు కొనసాగిస్తున్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగానే మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకత్వం షెల్టర్ తీసుకున్న నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ, కొండగావ్ సరిహధ్దు అటవీ ప్రాంతాల్లో రోజులకొద్ది గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. అక్కడి అటవీ ప్రాంతంలోనే మోహరించిన బలగాలు మూడు రోజులకోసారి రిట్రీట్ అవుతూ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అటవీ ప్రాంతంలో ఉన్న మావోయిస్టులకు ఆహారం పదార్థాలు అందుబాటులో లేకుండా పోయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆహారం కోసం బాహ్య ప్రపంచంలోకి వస్తున్న నక్సల్స్ కు, వారి కోసం మాటు వేసి ఉన్న బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చో్టు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

‘నంబాల’ …

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వారాజ్, మలోజ్జుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనుదాదా పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న, హిడ్మాతో పాటు పలువురు ముఖ్య నాయకులు దట్టమైన అటవీ ప్రాంతంలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉన్నట్టుగా పోలీసు అధికారులకు కీలక సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. పది రోజులకు పైగా మావోయిస్టు పార్టీ నక్సల్స్ కోసం ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో బలగాలు గాలింపు చర్యలు జరుపుతుండగా మావోయిస్టు నేతలు తారసపడడంతో ఎన్ కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది.

ఓఆర్ఎస్ మాత్రమే దిక్కా..?

దట్టమైన అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ నాయకులకు ఆహారం సకాలంలో దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఆదివాసీలు నివసించే గుంపుల వద్దకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకోవడం పెద్ద సమస్యగా మారిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో బలగాల కంటపడకుండా ఉండేందుకు మావోయిస్టులు కీకారణ్యాల్లోనే ఉంటూ స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నట్టుగా సమాచారం. అటవీ ప్రాంతం నుండి బయటకు వచ్చామంటే చాలు బలగాల చేతికి చిక్కే ప్రమాదం ఉందని గుర్తించి సేఫ్టీ జోన్లను వదిలి రావడం లేదని తెలుస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో బయటకు రాకుండా ఉంటున్న మావోయిస్టు పార్టీ శ్రేణులు చాలా వరకూ ఓఆర్ఎస్ తాగుతూ రోజులు గడుపుతున్నట్టుగా తెలుస్తోంది. అడవుల చుట్టూ బలగాలు మోహరించడంతో తమ వద్ద ఉన్న ఓఆర్ఎస్ నీళ్లలో కలుపుకుని తాగుతున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో అయితే పది రోజులకు పైగా కూడా ఓఆర్ఎస్ పై నే ఆదారపడి దళాలు జీవనం సాగిస్తున్నట్టుగా సమాచారం. వారి వద్ద ఉన్న ఓఆర్ఎస్ తో పాటు ఇతరాత్ర ఫుడ్ సప్లిమెంట్స్ కూడా అయిపోయినట్టయితే ఆహారం కోసం బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని బలగాలు అంచనా వేస్తున్నాయి.

You cannot copy content of this page