దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిషా, ఝార్ఖండ్ రాష్ట్రాలలోని కేంద్ర పార మిలటరీ బలగాలు వెనక్కి వెళ్లనున్నాయి. భారత్, పాక్ మధ్య యుద్దం జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలోని బలగాలను సరిహధ్దు రాష్ట్రాలకు పంపించాలని నిర్ణయించారు. దీంతో ఆపరేషన్ కగార్ లో కేంద్ర బలగాల సాయం లేకుండానే కొనసాగనుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న CRPF బేస్ క్యాంపులన్ని కూడా ఖాలీ కానున్నట్టుగా సమాచారం. ఇప్పటికే CRPF, COBRA జవాన్లు హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆయా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని కేంద్ర రిజర్వూ బలగాలను రిలివే చేసే ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న 9 వేల మంది బలగాలను కూడా వెనక్కి రప్పించాలని CRPF అధికారులు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆదివారం ఉదయం వరకు ఇండో పాక్ సరిహధ్దు ప్రాంతాలకు చేరుకుని అక్కడి అధికారులకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వచ్చాయి. అయితే మావోయిస్టు ఏరివేత మాత్రం యథావిధిగానే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. DRG, STF, బస్తర్ ఫైటర్స్ తో పాటు ఆయా రాష్ట్రాల్లోని పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది. అయితే చత్తీస్ గడ్ ప్రాంతంలో వినియోగిస్తున్న సైనిక హెలిక్యాప్టర్లను ఇక్కడే ఉంచుతారా లేక వాటిని కూడా తరలిస్తారా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.