దిశ దశ, జాతీయం:
ఈ దేశంలో ఉంటూ దాయాది దేశానికి వంత పాడుతున్న ప్రభుద్దులకు గుణపాఠం చెప్పారు పోలీసులు. పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యవహరించిన వారిని గుర్తించి స్పెషల్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెహల్గాంలో పర్యాటకులను విచక్షణా రహితంగా కాల్చి చంపిన ఉగ్రవాదులపై భారత రక్షణ వ్యవస్థ ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఆ తరువాత భారతదేశంపై దాడులకు పూనుకున్న పాకిస్తాన్ చర్యలను తిప్పికొట్టడంతో పాటు ఆ దేశం కోలుకోలేని దెబ్బ తీశాయి. అయితే భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ పాట పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ పోలీసులు పాకిస్తాన్ ప్రేమికులపై కఠినంగా వ్యవహరించారు. వారిని పట్టుకున్న భోపాల్ పోలీసులు ప్రత్యేక మర్యాదలు చేసి నగరంలోని వీధుల్లో పరేడ్ నిర్వహించారు. దేశ ద్రోహానికి పాల్పడితే ఇలాంటి గుణపాఠం చెప్తామన్న విషయం అందరికీ తెలియజేసే విధంగా వారిచే పరేడ్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది.
https://x.com/TimesAlgebraIND/status/1921788856761798806