Maoist news : నేషనల్ పార్క్ అడవుల్లో మరో ఎన్ కౌంటర్… అడెల్లు మృతి…

తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుని మృతి

దిశ దశ, దండకారణ్యం:

చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. 24 గంటల్లో రెండో సారి ఎదురు కాల్పులు జరగడంతో దండకారణ్యంలో ఉద్రిక్తత ఏర్పడింది. మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలే లక్ష్యంగా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. గురువారం నేషనల్ పార్క్ ప్రదేశంలో కేంద్ర కమిటీ సభ్యుడు, శాంతి చర్చల ప్రతినిధి గౌతం అలియాస్ సుధాకర్ మరణించారు, మరో ఎన్ కౌంటర్ లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, కొమ్రం భీం, మంచిర్యాల ఏరియా కమిటీ (కెఎం) కార్యదర్శి మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందినట్లు బీజాపూర్ పోలీసులు తెలిపాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చర్లకు చెందిన అడెల్లు 1995 నుంచి సాయుధ పోరాటం వైపు అడుగులు వేశారు. ఉత్తర తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసిన భాస్కర్ కార్యాలయంలో కలెక్టర్ ఏర్పాటు చేసి ఆదివాసీ జిల్లాలో పార్టీ గత వైభవం కోసం దృష్టి సారించారు.

పలు మార్లు మిస్…

ప్రాణహిత నది పరివాహక ప్రాంతం మీదుగా ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంలో సంచరిస్తూ పార్టీ పునర్నిర్మాణం కోసం అడెల్లు తీవ్రంగా ప్రయత్నించారు. ఉత్తర తెలంగాణలో పార్టీ ఉనికి లేకుండా పోవడంతో రిక్రూట్ మెంట్ తో పాటు అదనంగా సంచరించాలన్న లక్ష్యంతో సరిహధ్దుల్లో చాలాసార్లు ప్రారంభించారు. అయితే సరిహద్దు ప్రాంతాలపై తెలంగాణ పోలీసులు గట్టి నిఘా వేయడంతో ఆయన ప్రయత్నాలకు ఆదిలోనే చెక్ పెట్టారు. అడెల్లును కట్టడి చేసినట్టయితే పోలీసులు తూర్పు జిల్లాలో పార్టీ కార్యకలాపాలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉండవని గమనించిన ఆయన ప్రాణహిత నది దాటిన సమాచారం అందితే చాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించే వారు. దీంతో పలుమార్లు ఆడెల్లు తెలంగాణ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కూంబింగ్ బలగాల నుండి తృటిలో తప్పించుకుని దండకారణ్య ప్రాంతానికి సేఫ్ గా వెల్లిపోయేవాడు. 2020లో తిర్యాణి మండల కేంద్రంలో అడెల్లుతో పాటు మరో ముఖ్య నాయకుడు, పార్టీ క్యాడర్ ముగ్గురు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్నారు. భారీగా మోహరించాయి. కూంబింగ్ పార్టీల గురించి ముందే పసిగట్టిన అడెల్లు అక్కడి నుండి తప్పించుకుని వెల్లిపోయాడు. ఆయన అప్రమత్తతతో తనతో పాటు పార్టీ మరో ముఖ్య నాయకుడు కూడా సేఫ్ అయ్యాడు. దీంతో భాస్కర్ తెలంగాణ ప్రాంతానికి రావడానికి వెనకాముందు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో వైపున గడ్చిరోలి ఏర్పాటు ప్రాణహిత పరివాహక ప్రాంతంలో ఇటీవల భారీ ఎన్ కౌంటర్ జరిగింది. జిల్లాలో మావోయిస్టుల ఏరి వేట కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన C60 బలగాలు సరిహద్దు అడవులను జల్లెడ పడుతున్నందున ఈ ఎన్ కౌంటర్ జరిగింది. అప్పటి వరకు మహారాష్ట్ర, చత్తీస్ గడ్ సరిహధ్దుల్లోని ఇంద్రావతి నది తీరంలోనే ఎక్కువగా ఎదురు కాల్పులు జరిగేవి. కానీ ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని ప్రాంతంలో జరిగిన ఘటనతో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకత్వం కూడా అప్రమత్తమైంది. ఆ ఎన్ కౌంటర్ లో మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ కూడా ఉన్నాడని గడ్చిరోలి పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ మృతదేహాలను గుర్తించిన తరువాత ఘటన స్థలం నుంచి అడెల్లు తప్పించుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ ఎన్ కౌంటర్ తరువాత దండకారణ్య ప్రాంతం నుండి తెలంగాణ వైపు వచ్చే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకునే వాడని తెలిసింది. ఈ కారణంగానే కాలంలోనే ఆయన కదలికలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో తగ్గిపోయినట్లు కనిపిస్తున్నాయి.

నేషనల్ పార్క్…

అయితే తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో బలగాలు భారీగా మోహరించాయి. మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహారాష్ట్రలోని గడ్చిరోలి సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కోసం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కొన్ని ప్రాంతాలను కెటాయించింది. అయితే మావోయిస్టులను సమూలంగా అంతమొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో బలగాలను భారీగా మోహరించడంతో సరిహద్దు ప్రాంతాలను కూడా వదిలేయాలని పార్టీ నాయకత్వం సూచించినట్లుగా. ఇటీవల కర్రెగుట్టల సమీపంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు ఓ బంకర్ లో ప్రజావాణి తీసుకున్న సమాచారం బలగాలు భారీ స్థాయిలో మోహరించాయి. దీనితో తెలంగాణ రాష్ట్ర కమిటీ బాధ్యులు కూడా సేఫ్ జోన్ లకు తరలి వెళ్లాలని కేంద్ర కమిటీ సూచించినట్లుగా తెలుస్తోంది. మావోయిస్టులను పార్టీకి చెందిన ముఖ్య నేతల జోన్ ట్రేస్ చేసిన బలగాలు పెద్ద సంఖ్యలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కేంద్ర కమిటీతో పాటు ఆయా రాష్టాల కమిటీలు కూడా దట్టమైన ప్రాంతాలకే పరిమితం అయిన విషయం గుర్తించిన బలగాలు ఆ కీకారణ్యాలే లక్ష్యంగా సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్టుగా స్పష్టం అవుతోంది.