Phone Tapping Case: ఆయన వెంట ఉన్నదెవరూ?

రిటైర్డ్ ఐజీ ఎంట్రీపై చర్చ…

దిశ దశ, హైదరాబాద్:

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొనేందుకు హైదరాబాద్ చేరుకున్న రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు వెంట ఉన్నదెవరూ? ఆయనకు ఘన స్వాగతం పలికింది ఎవరూ అనేది అసలు చర్చ సాగుతోంది. దాదాపు 14 నెలల పాటు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు కారణంగానే ఫోన్ ట్యాపింగ్ చేశామని అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు వామూలం ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమెరికా వెళ్లిపోయిన ప్రభాకర్ రావును రప్పించేందుకు తెలంగాణ పోలీసులు శతవిధాల ప్రయత్నించారు సక్సెస్ అయ్యారు. ఎట్టకేలకు ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావ్ పెట్టి పెట్టగానే సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఓ అధికారి ఆయనకు ఘన స్వాగతం పలికారన్న విషయంపై చర్చ జరుగుతోంది. లుక్ అవుట్ సర్క్యూలర్ నోటీసులు, రెడ్ కార్నర్ ప్రాసెస్ జరగడంతో పాటు సుప్రీంకోర్టు నోటీసుతో స్వస్థలానికి చేరుకున్న ప్రభాకర్ రావుపై ప్రత్యేక అభిమానం చూపించడానికి కారణం ఏంటన్న చర్చ మొదలైంది.

ఎవరియన..?

మరో వైపున ప్రభాకర్ రావు వెంట ఉన్నవారు ఎవరూ అన్న చర్చ కూడా మొదలైంది. ఆయనకు ఎడమవైపున ఉన్న వ్యక్తి ఎవరన్న సందేహం కూడా వచ్చింది. అధికార వర్గాలు కూడా ఆయన గురించి వాకబు చేసినట్లు సమాచారం.

కరీంనగర్ వాసే…

కరీంనగర్ మాజీ కౌన్సిలర్ నడిపెల్లి అశోక్ రావు ప్రభాకర్ రావు సమీప బంధువని తెలుసుకున్నారు. రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు, అశోక్ రావులు వియ్యంకులని సమాచారం అందుకున్నారు. ఈ కారణంగానే అశోక్ రావు ప్రభాకర్ రావు వెంట ఉన్నారని తేల్చినట్లు సమాచారం.

IG PRABHAKAR RAOphone tappingPHONE TAPPING CASEsibtelangana news