Sand Mafia: ఇక్కడ నిబంధనలు అమలు చేయం…

మల్లారెడ్డిపల్లిలో ఏం జరుగుతోంది?

ఇసుక రీచుల్లో ఇష్టారాజ్యమా?

దిశ. దశ, హుజురాబాద్:

సహజ వనరుల విధ్వంసం జరుగుతున్నా… అక్కడ నిబంధనలు ఊసేత్తే వారు లేరు… బాహాటంగా సాగుతున్న అక్రమ తవ్వకాలను కట్టడి చేసేవారు లేరు… మానేరు నది సాక్షిగా జరుగుతున్న తీరు ఎలా ఉందంటే?

రీచులో ఇలా…

కరీంనగర్ సాండ్ కమిటీ (DLSC) విధించిన నిబంధనల ప్రకారం జిల్లా ఇసుక రీచుల్లో ఇష్టారాజ్యం కొనసాగుతోంది. DLSC సూచించిన విధంగా రీచుల్లో ఇసుక తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలు అమలు చేయడంలో ప్రత్యేక దృష్టి సారించాల్సిన TGMDC తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి శివారులో డిసిల్ట్రేషన్ చేపట్టాల్సిన ఇసుక రీచుల్లో హద్దులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రీచు నిర్వహకులను నియంత్రించే వారు లేకపోవడంతో మల్లారెడ్డిపల్లి నుండి దాదాపు కిలో మీటరు దూరం వరకు వెళ్లి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా DLSC చేసిన ప్రతిపాదనలకు విరుద్దంగా తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 495 × 390 ×1మీ కానీ ఇక్కడి నిర్వాహకులు తమకు నచ్చిన చోట ఇసుక తవ్వకాలు జరుపుకోవడానికి స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక రీచు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి శివారులలో ఏర్పాటు చేసిన ఈ రీచు కోసం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కేశవపూర్, గుండ్లపల్లి సమీపంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఎంత లోతు…?

మల్లారెడ్డిపల్లి రీచులో ఇసుక కోసం హద్దులు దాటి తవ్వకాలు జరుపుతుండడమే కాకుండా… లోతు విషయంలో కూడా పట్టించుకునేవారు లేకుండా పోయారన్న ఆందోళన వెళ్తున్నారు స్థానికులు. ఇక్కడ ఇసుక కోసం తవ్వకాలు జరుపుతుంటే జలధారలు కూడా ఏర్పడితే అసలేం జరుగుతోంది అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీటరు మించి ఇసుకన సేకరణ వద్దని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. భూగర్భ జలాలు కూడా బయటకు వచ్చేస్తున్నాయంటే ఇసుక తవ్వకాల తీరు ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల మానేరు నది అస్తిత్వంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. పర్యావరణానికి సవాల్ గా మారిన ఇసుక తవ్వకాలపై కఠినంగా ప్రవర్తించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. 

అజమాయిషీ ఎవరిదీ?

ఇసుక రీచుల నిర్వహణ బాధ్యతలు TGMDCకి అప్పగిస్తున్న DLSC ఆ తర్వాత అంతటితో సరిపెట్టుకుంటుంది. తాము చేసిన నిర్ణయాలకు అనుగుణంగా రీచుల్లో తవ్వకాలు జరుగుతున్నాయా లేదా అన్న విషయాలపై ఆరా తీసే వారు లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే ఇసుక రీచు కాంట్రాక్టు రద్దు చేయవలసి ఉంటుంది

 

Latest NewsManeru sandSAND MAFIASAND REACHESTelanagana news