కేసీఆర్ కు సరికొత్త భాష్యం చెప్పిన చెల్లెమ్మ…

దిశ దశ, కరీంనగర్:

అన్నయ్యపై చెల్లెలు సెటైరికల్ కామెంట్ చేశారు. X వేదికగా ఆమె చేసిన కామెంట్స్ గురించి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతకీ ఎవరా చెల్లెలు… ఎ అన్నపై కామెంట్ చేశారంటే…

సినీ నటి విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశించి విజయశాంతి చేసిన వ్యాఖ్యలు… అధికారం లేకుంటే అసలు బతకలేని స్థితికి చేరుకున్నట్టు కనబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు ఒక వైపు దశలవారిగా చేస్తుండగానే 30 రోజులు కాకముందే 420 అంటూ విమర్శిస్తూ పుస్తకం ప్రచూరించారు. అది కూడా దుర్మార్గ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ నెత్తిన రూ. 6 కోట్ల అప్పు పెట్టిన అంశం. వారే సిగ్గు లేక యాది మరిచి…
నిజానికి గత 10 ఏండ్ల బీఆర్ఎస్ మోసపు, అసత్యపు, అమలు చేయని హామీలు, అవినీతి, అరాచకాల గురించి K_కోతి చేష్టల C_ చేష్టల R_రాజ్యం (కేసీఆర్) పరిపాలన గురించి పుస్తకాలు ప్రచూరిస్తే అది ఒక గ్రంథాలయానికి చాలచ్చు బహుశ అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు.


CONGRESS PARTYkcr newstelangana newsTelangana PoliticsVIJAYASHANTHI
Comments (0)
Add Comment