TELANGANA: మెడికల్ కాలేజీలపై విజి”లెన్స్”


దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న వాస్తవ పరిస్థితులపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ఆరా తీస్తోంది. వరంగల్ కాళోజీ నారాయణ రావు మెడికల్ యూనివర్సిటీని అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో విజిలెన్స్ బృందాలు విచారణ చేస్తున్నాయి. రెండు మూడు రోజుల నుండి విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సంబంధిత మెడికల్ కాలేజీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. కాలేజీల వారిగా సీట్ల వివరాలు, ఏ కేటగిరీలో ఎన్ని సీట్లు కెటాయించారు, మేనేజ్‌మెంట్ కోటా ఎంత? NRI కోటా సీట్లు అలాట్ చేసిన వివరాలను కూడా సేకరిస్తున్నారు. నిబంధనలు ఏం చెప్తున్నాయి? సీట్లు ఎవరికి కెటాయించారు? మెడికల్ కౌన్సిల్ నిబంధనల మేరకే నడుచుకున్నారా లేదా అన్న వివరాలను సేకరించే అవకాశాలు ఉన్నాయి. హౌజ్ సర్జన్లకు ఇవ్వాల్సిన స్టైఫండ్, ఫ్యాకల్టీ పూర్తి వివరాలు, వారికి చెల్లిస్తున్న వేతనాలు, పేమెంట్ విధానం గురించి తెలుసుకోనున్నట్టుగా సమాచారం. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల వివరాలు, మెడికల్ కాలేజీలతో పాటు సంబంధిత ఆసుపత్రులలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై విజిలెన్స్ అధికారులు సమగ్రంగా ఆరా తీయనున్నట్టు. కాలేజీలు నిర్వహించే మెడికల్ క్యాంపులు, రోగులకు అందించడానికి కూడా ఆరా తీయనున్నట్టు సమాచారం.

ఆందోళనలు…

రాష్ట్రంలోని కొన్ని మెడికల్ కాలేజీలలో హౌజ్ సర్జన్లకు నెలా నెల ఇచ్చే స్టైఫండ్ దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలలో హౌజ్ సర్జన్ల ఆందోళన గురించి అందరికీ తెలుసు. కొన్ని కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను సస్పెండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు సిద్ధినట్టుగా తెలుస్తోంది. కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా కొన్ని కాలేజీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇటీవల మెడికల్ కాలేజీల తీరుపై ఫిర్యాదులు కూడా యూనివర్శిటీకి పెద్ద ఎత్తున వెలుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీపై 250కి పైగా ఫిర్యాదులు యూనివర్సిటీకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు యూనివర్సిటీ వీసీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించినట్లుగా విశ్వసనీయ సమాచారం.

గతంలో…

రాష్ట్రంలోని కొన్ని మెడికల్ కాలేజీలలో సీట్ల కెటాయింపు వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. వరంగల్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ED కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. తాజాగా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం కూడా విచారణ చేపట్టడం సంచలనంగా మారింది.

KalojiMEDICAL COLLEGESMEDICAL SEATS SCAMtelangana newsTG NEWS