అక్రమ కేసు బనాయించారంటూ బీజేపీ నేత ఆత్మహత్య: మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత

దిశ దశ, చెన్నూరు:

నా చావుకి కారణం రుద్ర భట్ల సంతోష్, గాలి మధు, చింతకింది కమల, వీరి వలన నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. వీరు నాపైన రాజకీయంగా ఎదుర్కొలేక తప్పుడు కేసులు పెట్టించి నా యొక్క పరువు, ప్రతిష్టను దెబ్బ తీశారు. నా చావుకు కారణం అయ్యారు. నేనే తప్పు చేయలేదు. అలాంటి క్యారక్టర్ నాది కాదు. అందుకని వీరిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలి. అలాగే నా యొక్క కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉండాలి. నా కుటుంబాన్ని కాపాడాలి. వేమనపల్లి మండల ప్రజలారా మన మండలంలో కుల రాజకీయాలు ఉన్నాయి. అప్పుడు దుర్గం శివరాం, ఇప్పుడు ఏట మధూకర్ ఇలా బలి కావల్సిందేనా. అందుకే ఆలోచించండి, ఈ అగ్రవర్ణ పాలకులకు బుద్ది చెప్పండి. భారత్ మాతాకీ జై అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధూకర్.

మంచిర్యాల జిల్లా వేమునపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధూకర్ శుక్రవారం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని షర్ట్ ప్యాకెట్ లో లభ్యమైన సూసైడ్ లెటర్ కన్నీరు పెట్టిస్తోంది. తన కుటుంబ బాగోగులు చూసుకోవాలని బీజేపీ పార్టీని అభ్యర్థించిన మధూకర్ తనపై తప్పుడు కేసు బనాయించారని వివరించిన తీరు స్థానికంగా విషాదాన్ని నింపింది. పది రోజుల క్రితం ఏట మధూకర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల కారణంగానే మధూకర్ ను తప్పుడు కేసులో ఇరికించారి ఆరోపించారు. ఆయన రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే స్థానిక ఎస్సైపై కూడా క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. ఈ సందర్బంగా నీల్వాయి రహదారిపై బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. 

CHENNUR NEWSMANCHERIALtelangana bjpTelangana Politicsvemannpally