కాంగ్రెస్ టికెట్ కోసం ‘వెలిచాల’ ధరఖాస్తు: సోనియామ్మకు గిఫ్ట్ గా ఇస్తా…

దిశ దశ,  హైదరాబాద్:

కరీంనగర్ లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ వెలిచాల రాజేందర్ రావు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తన కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసిందని, గత రెండు ఎన్నికల్లో కూడా తాను కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశానన్నారు.  తన తండ్రి వెలిచాల జగపతి రావు కూడా కాంగ్రెస్ పార్టీతోనే అనుభందం పెట్టుకున్నారన్నారు. తనకు అవకాశం ఇచ్చినట్టయితే కరీంనగర్ ఎంపీగా గెలిచి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులతో పాటు లోకసభ పరిధిలోని ఎమ్మెల్యేలు, సెగ్మెంట్ ఇంఛార్జీలు తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని వెలిచాల రాజేందర్ రావు కోరారు. 

CONGRESS PARTYkarimnagar newskarimnagar politicstelangana newsTelangana Politics
Comments (0)
Add Comment