జనగామ డీఎస్పీపై ఈసీ వేటు…

దిశ దశ, వరంగల్:

వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఓ పోలీసు అధికారిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదు అందుకున్న ఎన్నికల కమిషన్ అదికారులు సదరు అదికారిని బదిలీ చేయాలని ఆదేశించింది. జనగామ ఏసీపీగా పనిచేస్తున్న దామోదర్ రెడ్డి ఎన్నికల కోడ్ కు విరుద్దంగా వ్యవహరించారని గుర్తించిన ఈసీ అతన్ని బదిలీ చేయాలని ఆదేశించడంతో పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

2024 ElectionsECIjanagamapolice newswarangal