ఉగ్ర సంస్థల భాగస్వామ్యం ఎందుకు..?
ఆ మెయిల్ లో గందరగోళ సమాచారం…
దిశ దశ, హైదరాబాద్:
తెలుగు రాష్ట్రాల్లోని కోర్టుల్లో బాంబులు ఏర్పాటు చేశామంటూ బుధవారం ఆయా కోర్టులకు వచ్చిన మెయిల్ లో ఏముంది..? పొంతన విషయాల వెనక ఆంతర్యం ఏంటీ..? నిఘా వర్గాలకు, దర్యాప్తు అధికారులకు ఈ అనుమానం వస్తోంది. సంబంధం లేని విషయాలతో ముడిపెట్టి మెయిల్ చేయడం వెనక ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది.
వివరాలు ఇలా…
బుధవారం హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ, కరీంనగర్ జిల్లా, ఏపీలోని రాజమండ్రి కోర్టుల్లో బాంబులు అమర్చామని మద్యాహ్నం 12.05 గంటలకు వాటిని పేల్చుతామన్న సమాచారంతో రెండు రాష్ట్రాల ప్రోలీసులు అప్రమత్తం అయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దింపిన పోలీసు అధికారులు కోర్టు హాళ్లు, భవనాలు, ఆవరణలో అణువణువు తనిఖీలు చేయించి బాంబులు ఏమీ లేవని తేల్చారు. అయితే అగంతకులు మెయిల్ లో వెల్లడించిన వివరాలే అనుమానాలకు తావిస్తున్నాయి. తమిళనాడు పోలీసులచే ఆర్డర్లీ విధానం ద్వారా వెట్టి పనులు చేయించుకుంటున్నారని, చివరకు వివాహేతర బంధం పెట్టుకున్న వారి ఇండ్లలోనూ వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని మెయిల్ లో వివరించారు. నైనార్ దాస్ పోలీసు యూనియన్ 1979 సిఫార్లను అమలు చేయాలని మీ కోర్టులను లక్ష్యంగా చేసుకున్నామని మెయిల్ లో వివరించారు. ఇందు కోసం ఆజాదీ కశ్మీర్ పాక్, ISI, Q బ్రాంచ్ సభ్యులు ఇందుకోసం సమాయత్తమై ఉన్నారని అందులో పేర్కొన్నారు.
లింకేంటీ..?
sunniya_dasan@outlook.com మెయిల్ అడ్రస్ నుండి బుధవారం ఉదయం 9.07 గంటల సమయంలో కోర్టులకు చేరింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తమిళనాడు పోలీసులను వెట్టి నుండి విముక్తి చేయాలని, నైనార్ యూనియన్ సిఫార్సులు అమలు చేయాలని ప్రధానమైన డిమాండ్ చేశారు అగంతకులు. తమిళనాడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావల్సిన ఈ అంశాల గురించి తెలంగాణ, ఏపీ కోర్టలకు బాంబు బెదింరింపులు చేస్తూ మెయిల్ చేయడ ఎందుకన్నదే మిస్టరీగా మారింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచాల్సిన డిమాండ్లను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తీర్చే అవకాశమే ఉండదన్నది జగమెరిగిన సత్యం. తెలుగు రాష్ట్రాల కోర్టుల్లో బాంబులు ఉన్నాయని హెచ్చరికలు పంపిస్తే ఇక్కడి కోర్టులు తమిళనాడు ప్రభుత్వానికి ఎలా సూచిస్తాయన్నది అంగతకులకే తెలియాలి. మరో వైపున ఉగ్ర సంస్థల భాగస్వామ్యం కూడా ఇందులో ఉండడమేంటీ..? ఆజాదీ కశ్మీర్ పాక్, ISI, Q బ్రాంచ్ సభ్యులకు తమిళ పోలీసుల ఆర్డర్లీ వ్యవస్థకు సంబంధం ఉండదన్నది వాస్తవం. దేశ అంతరంగిక భద్రతకు సవాల్ విసిరే ఉగ్ర సంస్థలు తమిళనాడు పోలీసుల సంక్షేమం కోసం భాగస్వామ్యులు అయ్యే అవకాశం అయితే అసలే లేదు. పొంతనలేని విషయాలను క్రీడీకరించి తెలుగు రాష్ట్రాల్లోని మూడు కోర్టులకు మెయిల్ చేసిన అగంతకులు కుట్ర కోణంతో ఈ ఆలోచన చేశారా లేక, మరో కారణమేదైనా ఉందా..? ఉండి ఉంటుందని అనిపిస్తోంది.