Telangana: కార్గో TO కాలేజ్… విద్యార్థుల కష్టాలు

దిశ దశ, జగిత్యాల:

ఆ కాలేజీ విద్యార్థుల పుస్తకాలతో కుస్తీ పడి చదవడమే కాదు… కార్గో వాహనాల నుంచి నోటు బుక్స్ మోసుకెళ్లాల్సిందే. రెసిడెన్షియల్ కాలేజీ భవనంలోకి బుక్స్ తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా వారిదే. జగిత్యాల జిల్లా వైద్యని విద్యానగర్ లో ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ విద్యార్థులపై అదనపు భారం వేస్తున్నారు. కార్గో వాహనంలో వచ్చిన తరగతి నోట్ బుక్స్ కాలేజీ వరకూ తీసుకెళ్లేందుకు కూలీలను పెట్టడమో లేక, కాలేజీలో పని చేస్తున్న నాలుగో ఉద్యోగులకు అప్పగించడమో చేయవలసి ఉంటుంది. కానీ స్టూడెంట్స్ తోనే నోట్ బుక్స్ తీసుకెళ్లడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. తరగతి గదులకు, రెసిడెన్షియల్ భవనానికి పరిమితమై విద్య అందుకోవలసిన స్టూడెంట్స్ చే నోటు బుక్స్ మోయడం సరికాదని స్థానికులు అంటున్నారు. స్టూడెంట్స్ చే ఇలా వెట్టి చాకిరీ చేయించడంపై మైనారిటీ విద్యాశాఖ అధికారులు కూడా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

EDUCATIONJAGITIAL NEWSLatest Newstelangana newsTG NEWS